తోలకరి ప్రేమ పార్ట్ 1

తోలకరి ప్రేమ పార్ట్ 1

చల్లటి సాయంత్రం వేళ అద్భుతంగా ఉంది. మనసుకు హయిని కలిగించేలా వర్షం పడుతుంది. ఫుల్ గా తడిచిపోయాను. మొత్తానికి మెట్రో ఎక్కాను. హైటేక్ సిటీ లో ఎక్కి బేగం పేట్ లో దిగాను. మళ్లీ వర్షం మొదలైంది. హడావుడిగా రోడ్డు దాటబోతుంటే ఓ పెద్ద హార్న్ సౌండ్ వినిపించింది. భయంతో కళ్ళు, చేతులతో చేవులు మూసుకున్నాను.

కాసేపు నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఎవరో నన్ను లాగినట్లు అర్థం అయింది. కొన్ని సెకనుల తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఎదురుగా నా చెతిని పట్టుకుని ఉన్నాడు. నాకన్నా రెండు ఇంచులు పెద్దగా.. వర్షంలో పూర్తిగా తడిచిపోయాడు. అకాశంలో వచ్చిన మెరుపులు అతని కళ్ళలో కనిపించాయి. తెల్లగా ఉన్నాడు. మోస్తారు గడ్డం ఉంది.

తన ఎడమ చేతితో తడిచిన జుట్టును పైకి అంటూ.. తన చేతిలో ఉన్న నా చేతిని వదిలేశాడు. “ఏంటండి రోడ్డు దాటేముందు చూసుకోరా.. నేను టైంకి రాకుండి ఉంటే.. అయిన ఎందుకు అంత హడావుడి ?” “క్షమించడి.. వర్షంలో ఇప్పటికే తడిచాను. ఇంకా తడిస్తే జ్వరం వస్తుందనే భయంతో ఇలా రోడ్డు దాటబోయాను” “అవును మంచి పని చేశారు. కానీ జ్వరం వస్తే రెండు రోజులు సెలవ పెట్టొచ్చు.

కానీ మీకు ఏదైన అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అలోచించండి” “నేను అలా థింక్ చేయలేదు” “అదే మీ అమ్మాయిలు చేసే తప్పు.. రోడ్డుపైన ఎలా వెళ్లిన అవతల వాడు స్లో అవుతాడని అని మీ గుడ్డి నమ్మకం” “చా చా.. నిజంగా అలాంటిది ఏం లేదు. మాములుగా క్రాస్ చేయబోయాను” “సరే మరోసారి ఇలా కంగారుగా, హడావుడిగా దాటకండి. అక్కడ సిగ్నల్ ఉంది కదా.. అక్కడ వరకు వచ్చి సిగ్నల్ పడిన తర్వాత వెళ్లండి ” “సరే అలాగే అండి” “సరే వర్షం తగ్గేలా లేదు. నాకు చాలా పని ఉంది.

నేను ఈ సందులో నుంచి వెళ్లిపోతాను. మీరు మాత్రం కాస్త చూసుకుని వెళ్లండి” “అలాగే అండి” “అయ్యో రామా.. మీరెంటండి ఏం చెప్పిన ఒక్క పదంతో జవాబు ఇచ్చేస్తారు. కానీ ఇలానే ఉండాలి. తెలియని వ్యక్తితో ఎక్కువ మాట్లాడోద్దు.. ఇక ఉంటా బై” అతను ఆ వర్షంలోనే హీరోలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నా కళ్ళు అతనిపైనే ఉన్నాయి.

ఓ మెరుపు పెద్దగా మెరిసింది. అతను ఓ పది అడుగులు వేసి నావైపు తిరిగి ఓ చిన్న నవ్వు నవ్వాడు. నాకు నవ్వొచ్చింది. “ఓ అమ్మాయి.. మీ పేరు ఏంటో చెప్పలేదు ?” అని అంత దూరంలో నుంచే అరిచాడు. “నా పేరు. శ్రావణి” “ఏంటో.. వినిపించడం లేదు.. కాస్త గట్టిగా చెబుతారా ?” “అయ్యో.. నా పేరు శ్రావణి” “హలో శ్రావణి గారు.. నా పేరు కార్తిక్” సరే అన్నట్లు తల ఊపాను..

“నన్ను గుర్తుపెట్టుకోడి” అని మళ్లీ గట్టిగా అరిచాడు. సరే అన్నట్లు తల ఊపాను. ఇంతలో అతను వెనక నుంచి స్పీడ్ గా వస్తున్న ఆటోని చూసుకోండి ముందుకు అడుగు వేశాడు. అది అతనిని గుద్దేసింది. అది చూసిన నాకు ఆ వర్షంలో కూడా చమటలు పట్టినంత పని అయింది.

నిమిషం ఆలస్యం చేయకుండా అతని దగ్గరకు వెళ్లాను. అతను నన్ను చూస్తూ ఇంకా నవ్వుతునే ఉన్నాడు. అతని నవ్వుకు అర్దం ఏంటో నాకు అర్దం కాలేదు. కానీ తన కాలుకి రక్తం వస్తుంది. “అయ్యో కార్తిక్ నీ కాలుకి రక్తం వస్తుంది.. పదా ఆసుపత్రికి వెళ్దాం” “శ్రావణి.. ఆ నొప్పి నాకు తెలియట్లేదు” “మిస్టర్ కార్తిక్.

సినిమాలు ఎక్కువా చూస్తావా.. లేకుంటే ఇది సినిమా అనుకుంటున్నావా ?” అని అతనిపై కాస్త కోపం ప్రేమ తెలియకుండానే చూపించాను. కార్తిక్ ను గుద్దిన ఆటో అతని వెళ్లిపోయాడు. మరో ఆటోని పిలిచి అందులోకి కార్తిక్ ను ఎక్కించాను. వర్షం ఇంకా తగ్గలేదు. రాను రాను వర్షం పెరిగింది. ముందు ఉన్న రోడు కూడా కనిపించడం లేదు.

డ్రైవర్ ఆటో ఓ పక్కన ఆపాడు. “శ్రావణి గారు మీరు ఏం బాధపడకండి. ఇది పెద్ద దెబ్బ కాదు” “అయ్యో మీ దారిలో మీరు వెళ్లేవారు. నేను రోడ్డు సరిగ్గా దాటకపోవడం వల్లే మీకు ఇదంతా జరిగిందనిపిస్తోంది” “నాకు ఎలా ఉందో తెలుసా శ్రావణి గారు ?” “మీరు రోడు సరిగ్గా దాటకపోవడమే నాకు మంచి జరిగిందనిపిస్తోంది” “ఏ కార్తిక్.. ఎందుకు అలా అనిపిస్తోంది” “అలా జరగకుంటే మీరు నాకు పరిచయం అయ్యేవారు కాదు కదా” అని నవ్వేశాడు “అతని మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్దం కాలేదు”

కానీ ఓ చిన్న స్మైల్ ఇచ్చాను. బాబు వర్షం తగ్గింది హాస్పిటల్ కి పోనివు తొందరగా.. కార్తిక్ ను హాస్పిటల్లో చెర్పించి బయటకు కూర్చుకున్నాను. కాసేపు అక్కడే ఉన్నాను. ” అమ్మాయి. అతనికి కాలుకు కాస్త దెబ్బ గట్టిగానే తాకడం వల్ల నడవడం ఇబ్బంది అవుతుంది.

కాబట్టి ఈ రోజు నైట్ కి ఇక్కడే రెస్ట్ తీసుకుని మార్నింగ్ తీసుకెళ్లండి” అని డాక్టర్ చెప్పారు. “కార్తిక్, కార్తిక్ ఓ సారి కళ్ళు తెరువు. ఏంటి పడుకున్నావా ?” “హా డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చాడు. నిద్ర పట్టేసింది. అవును మీరు ఇంటికి వెళ్లాలేదా ? అసలు టైం ఎంత ?” “టైం రాత్రి 12 అవుతుంది” “అయ్యో శ్రావణి గారు. మీరు వెళ్లిపోవాల్సింది అనోసరంగా ఈ టైం వరకు ఉన్నారు.

నేను మార్నింగ్ వెళ్లేవాడిని కదా” “అయ్యో మీరు నా ప్రాణాలు కాపాడారు. మీమ్ములని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్లాను. మీ ఫ్రెండ్స్ కి కాల్ చేద్దాం అంటే మీ ఫోను కూడా తడిచిపోయింది. ఆన్ కావడం లేదు” “నిజంగా సారీ. నాకు నిద్రపట్టేసింది కానీ మీరు ఎలా వెళ్తారు చీకట్లో ?” “పర్లేదు. నేను మార్నింగ్ వెళ్తాను” “అయ్యో అసలు వద్దు.

మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి ?” ” నేను సోమాజిగుడాలో నా ఫ్రెండ్స్ తో కలిసి రూంలో ఉంటా. కానీ భేగంపేట్ లో నా ఫ్రెండ్ ఉంటుంది ఆమె కోసం అని ఇటువైపు వచ్చాను.” “సరే మీ ఫోన్ ఇవ్వండి ఒకసారి” అని ఫోన్ తీసుకుని అతని ఫ్రెండ్ ’రాకేష్’ కి కాల్ చేశాడు. “రాకేష్. నేను రా కార్తిక్. నువ్వు అర్జెంట్ గా ఓ లోకేషన్ షేర్ చేస్తా అక్కడికి కార్ లో వచ్చేయ్” అని చెప్పాడు.

సరిగ్గా పది నిమిషాలకు రాకేష్ వచ్చాడు. ”రాకేష్. ఈమె నా ఫ్రెండ్ శ్రావణి. ఈమెని జాగ్రత్తగా ఆమె రూం దగ్గర దిగబెట్టి. ఇక్కడికి వచ్చేయ్. శ్రావణి గారు వీడు రాకేష్. మీ రూం దగ్గర వదిలిపెడుతాడు” “సరే కార్తిక్” అని బయటకు వచ్చి కారు ఎక్కాను. కానీ కార్తిక్ వెళ్లిపోమన్నందుకు కోపం వచ్చినా.. నా కోసం అతని తీసుకున్న కేరింగ్ బాగా నచ్చింది. మొత్తానికి ఇంటికి వచ్చాను.

“రాకేష్. హాస్పిటల్ వెళ్లాక ఓ సారి కార్తిక్ ను నాకు కాల్ చేయమని చెబుతావా ?” “సరే శ్రావణి గారు చెబుతాను” వర్షం కాస్త తగ్గినట్లు అనిపించింది. సమయం రాత్రి రెండు అవుతుంది. కానీ కార్తిక్ నుంచి కాల్ రాలేదు. రాకేష్ కి కాల్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోంది. మిగతాది పార్ట్ 2 చూద్దాం..

– భరద్వాజ్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *