తొలి పొద్దు

తొలి పొద్దు

తొలిపొద్దు విరిసింది
రవికిరణం పొడిచింది
అవనిని ముద్దాడింది
పకృతి కాంత మేల్కొంది
నవకమలం పూసింది
మధుపం తాకి,
మందారం మురిసింది
శుభోదయం పలకరించింది
గగన విధుల్లో పక్షులు
విహారంచేస్తూ చెలిమిజట్టు
కట్టి కలిమి బంధంతో
వసంత గానం ఆలపించాయి..!!

శుభోదయం                     

-సైదా చారి మండోజు

Related Posts