తొలిచూపు

తొలిచూపు 

మాటలు లేని మంత్రము 
భాష లేని భావము తొలిచూపు 
కళ్ళలోన కదలాడుతూనే 
హృదయ వీణ రాగము
తొలి చూపు 
ఆలోచనలు ఆగిపోయి 
ప్రేమ పదాల ఉత్తరం
తొలి చూపు 
అందానికి బందమై 
వింత  అనుభవాల  గంధమై పరిచయానికి 
తెరతీసి పరిధులు దాటి 
ప్రణయమై  
ప్రేమ పుస్తకంగా పయనం అయితే 
తొలి చూపు అవుతుంది 
మలి బంధమై 
కానిచో 
అది అవుతుంది జీవితంలో 
ఏప్రిల్ ఫూల్….
– జి.జయ

Related Posts