తొమ్మిదవ తరగతి ప్రేమ కథ

తొమ్మిదవ తరగతి ప్రేమ కథ

తొమ్మిదవ తరగతి ప్రేమ కథ

అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరిలో ఇద్దరు ఫ్రెండ్స్ అందులో ఒకరి పేరు సూర్య ఇంకొకరి పేరు శ్రావణి వీళ్ళు ఒకటే స్కూల్ లో చదువుతున్నారు. రోజూ కలిసి స్కూల్ కి వెళ్ళడం ఇంటికి రావడం ఇలా వీళ్ళ స్నేహం మొదలు అయ్యింది సూర్య స్కూల్ లో ఎప్పుడు శ్రావణి పక్కనే కూర్చునే వాడు ఎందుకంటే శ్రావణి అంటే వాడికి చాలా ఇష్టం ఇలా వీళ్ళు ఆనందంగా గడిపేస్తారు అనుకోకుండా సూర్య లో శ్రావణి పై ప్రేమ మొదలు అవుతుంది కాని సూర్య తన ప్రేమని గుండెల్లోనే దాచుకుంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరు వాళ్ళ పరీక్షలు రాసి కొన్నాళ్ళ తర్వాత 9 తరగతిలో చేరారు సూర్య శ్రావణి దగ్గరకి వెళ్లి పలకరించాడు.

సూర్య తన ప్రేమని బయటపెట్టాడు కానీ శ్రావణి ఒప్పుకోలేదు సూర్య అడిగాడు శ్రావణి నేనంటే ఇష్టం లేదా శ్రావణి నేను నిన్ను ఎప్పుడు ఒక ఫ్రెండ్ అనుకున్న అని సమాధానం ఇస్తుంది ఆ సమాధానంతో సూర్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎగ్జామ్స్ రానే వచ్చాయి ఎగ్జామ్స్ అయ్యాక ఎవరి దారి వారు చూసుకున్నారు కానీ సూర్య మాత్రం తన ప్రేమని మరిచిపోలేక తన చదువు కొనసాగిస్తున్నాడు.

సూర్య వాళ్ళ అమ్మ నాన్న సూర్యకి ఎన్నో డబ్బులు కర్చుపెట్టి విదేశాలు పంపించారు 5 ఏళ్లు గడిచింది సూర్య ఒక మంచి పొజిషన్లో ఇండియా తిరిగి వచ్చాడు. తన స్నేహితులను కలుసుకున్నాడు అలా మాటల సందర్భంలో సూర్య శ్రావణి గురించి అడిగాడు ఒక స్నేహితుడు చెప్పాడు శ్రావణికి పెళ్లి అయ్యింది అని. సూర్య ఓ అవునా అన్నాడు.

అలా స్నేహితులతో ఆనందంగా గడిపిన సూర్య ఇంటికి వచ్చాడు. సూర్య వాళ్ళ అమ్మ నాన్న ఒక మంచి సంబంధం చూశారు సూర్య కోసం సూర్య కూడా ఆ పెళ్లి కి ఒప్పుకున్నాడు ఇద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.

– భరద్వాజ్

ఫీలింగ్ Previous post ఫీలింగ్
జై జవాన్ Next post జై జవాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *