త్యాగానికి మారుపేరు

త్యాగానికి మారుపేరు

త్యాగానికి మారుపేరు

అది 1950 వ సంవత్సరం.మన దేశానికి స్వతంత్రవచ్చి మూడు సంవత్సరాలుఅవుతోంది. వెంకటప్పయ్యగారు కనుమూరులో ఉండేవారు. ఆయన మాఅమ్మకి నాన్నగారు అంటే
మా తాతగారు. మా అమ్మమ్మ పేరు సీతారావమ్మగారు. మా తాతగారు వ్యవసాయం చేసే వారు. ఆయనకు సంతానం లేని కారణంగా ఒక బాబును దత్తత తీసుకున్నారు. ఆ బాబు
పేరు కృష్ణ.

ఆ చిన్న బాబు ఇంటికి వచ్చాక మా అమ్మపుట్టింది. దత్తత రోజు ఇచ్చిన మాట ప్రకారం అప్పుడు మా తాత తన పేరున ఉన్న యావదాస్తి 22 ఎకరాలు ఆ బాబు పేరున వ్రాసేసారు. ఆ బాబు తన ఇంటికి వెళ్ళిపోయాడు.

మా తాతకుమిగిలింది 2 ఎకరాల పొలం.ఆ తర్వాత ఆయన కూడాచనిపోయారు. అప్పుడు మాఅమ్మమ్మ వ్యవసాయం చేసిమా అమ్మను చదివించింది.అమ్మ కూడా కష్టపడి చదివి
మంచి మార్కులు తెచ్చుకుంది.

పెళ్లి తర్వాత మా నాన్న మాఅమ్మను చదివించారు. ఆయన అప్పటికే టీచరుగాపనిచేసేవారు. ఆ తర్వాతనేను పుట్టడం,నా తర్వాతతమ్ముడు పుట్టడం జరిగిపోయాయి. ఆ తర్వాత
అమ్మ జీవిత భీమా సంస్ధలోఆఫీసరుగా చేసి రిటైర్ అయ్యిమూడేళ్ళ క్రితం చనిపోయారు.

ఇక్కడ చెప్పాల్సిన విషయంఏమిటంటే మా తాత ఏ కాగితం మీద దత్తత తీసుకున్నబాబుకు పొలం ఇస్తానని వ్రాయలేదు. కేవలం మాటకోసం అలా ఇచ్చేసారు.

తనకుసొంత కూతురు పుట్టినా ఆమెకోసం కేవలం రెండు ఎకరాలుఅది కూడా అమ్మమ్మ పొలంమాత్రమే ఉంచారు. ఆ రోజుల్లోమనుషులు మాట కోసం ప్రాణం ఇచ్చేసేవారు.

మాఅమ్మమ్మ కూడా ఆ దత్తపుత్రుణ్ణి ఒక మాట అనేదికాదు. భర్త మాట జవదాటనిఇల్లాలు. మా అమ్మ కూడాచిన్నప్పుడు పేదరికం అనుభవించినా ఏ నాడూతండ్రి చేసిన త్యాగాన్ని విమర్శించలేదు. అది ఖచ్చితంగా త్యాగమే.

సొంత కూతురుని కాదనిఇచ్చిన మాట కోసం వెళ్ళిపోయిన దత్త పుత్రుడికియావదాస్తి వ్రాసిన తాతనుచూస్తే గర్వంగా ఉంటుంది.ఇప్పుడు ఆ ఆస్తి ఎంతలేదన్నాపద్దెనిమిది కోట్లు. ఈ రోజుల్లోఅలాంటి సంఘటనలు అసలే జరగవు. ఇది నిజంగా జరిగిన కధ.

 

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

తనకు మాలిన ధర్మం Previous post తనకు మాలిన ధర్మం
నీ త్యాగ నిరతికి జోహార్లు Next post నీ త్యాగ నిరతికి జోహార్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close