ఉచ్చు

ఉచ్చు

గగనసీమల్లో కదిలే మేఘాల్లా
ఆలోచనల శకలాలు
అందని తాయిలాలకు వలవేస్తుంటాయి

కదలని శరీరం కాంక్షల కొలువై
అర్రులు చాస్తుంటుంది
వదలని గతంలా
స్వగతం మొడుతూ ఉంటుంది

మాయల ఉచ్చు మెడకు బిగుస్తూ ఉంటుంది
మాటల గారడీలాంటి లెక్కేదో మనసు చేస్తుంటుంది
చివరకు మిగిలేది నీ ఒంటరితనమే అని తేల్చేస్తుంది

గగనం శూన్యమయితేనేమి
గమకాలు పలికించటం మాననట్టే
ఆలోచనల శకలాలు
ఆవేదనల హలమై
అక్షరసాగు చేస్తే
గాడి తప్పిన మనసును
ఏ గారడీ ఉచ్చు ఏమీ చేయలేదు

– సి. యస్. రాంబాబు

Related Posts