ఉదయం

ఉదయం

పువ్వులు వికసించే
నవ్వులు విరబూసే
చెలి మోమును చూడగ
ఈ ఉదయకాంతిలో…
పూలను కిరణం తాకగా
నా చెలి బుగ్గను నిమరగా
పక్షులు కిల కిల నవ్వేను
ఈ ఉదయ కాంతిలో….
ఎర్రగ పండేను తూర్పు
దూడలు చేరెను పొదుగున
జీవన చక్రం మొదలగున
ఈ ఉదయకాంతి తో….
అలసిన మనసు
చెదిరిన సొగసు
వాడిన పువ్వ
కోరెను ఉదయకాంతిని.

– హనుమంత

Related Posts