ఉదయిస్తాం

ఉదయిస్తాం

కుర్రకారులం ఈ కారు పిల్లలం..
కలలు బంగారు కలలు కనే కుర్రకారులం…
భలే హుషారు పిల్లలం…
వేట మొదలయ్యింది..

బ్రతుకు వేట మొదలయ్యింది…

పట్టాలున్నాయని బ్రతుకు పట్టాలెక్కాలని

అభిలాషతో ఉన్నాం..

తలపట్టుకు తిరుగుతున్నాం…

తలపెట్టిన పనులు సిద్ధించాలని…
కానీ నిరాశ నిస్పృహ ఒకపక్క నీడలా వెంటాడుతున్నాయి…

తల్లిదండ్రులు నెల నెల వారి ఖర్చుకు డబ్బులు పంపిస్తున్న…
వాళ్ల కలలు నెరవేరేనా…

ప్రయత్నమే సాగిస్తున్న ఫలించిందా కష్టం ఇకపైన…
నిరాశ చుట్టుముట్టిన అభిలాష ఒక మూల ఉందిలే…
అది తీరే రోజు దగ్గరుoదిలే …
మా శక్తి ఆసక్తి మాకు ఉందిలే…
లక్ష్యం నెరవేరే రోజు దగ్గర ఉందిలే…

అలసట ఎందుకు అలిసిన గుండెకు

ప్రయత్నం అనే ఆశను నింపి లక్ష్యం వైపు పయనిద్దాం…
కలలే ఫలించి మనమే ఉదయిస్తాం….

– పలుకూరి

Related Posts