ఉగాది ఊసులు

ఉగాది ఊసులు

1 ఆ.వె ఉప్పు.తీపి.కారముపకారమును చేయు
  చేదు.వగరు.పులుపు చేయు మేలు
  ఏవి యెక్కువైన ఇక్కట్లు వచ్చును
  మితము ఎప్పుడైన హితము గూర్చు

2 తే.గీ. కలిమి లేములు సంతోష కష్టసుఖము
   లన్ని అడ్డంకుల మనిషి అధిగమించి
   నీరస పడిపోకుండ యెదురు నిలువ వలెను
   పారిపోకుండ నిలబడు ఫలితమిచ్చు

3 తే.గీ. పుట్టి నప్పటి నుండియు గిట్టువరకు
   నరుని జీవిత మంతయు నాటకమ్ము
   కష్ట సుఖములే గాకయు కలిమి లేము
   లన్ని కలబోసి వచ్చును అందరకును

– కోట

Related Posts