ఉమ్మడి కుటుంబం మంచిదా చిన్న కుటుంబం మంచిదా

ఉమ్మడి కుటుంబం మంచిదా చిన్న కుటుంబం మంచిదా

ఈ ప్రశ్నకు సమాధానం అందరూ చెప్పేది చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అనేదే జవాబు వస్తుంది . కానీ చిన్న కుటుంబాలు అంటే ముగ్గురు ఉన్నప్పుడు చిన్న కుటుంబం అనేవారు ఇప్పుడు అది మారిపోయి మేము ఇద్దరం మాకు ఒక్కరూ అంటూ ఇప్పటి యువత ఉమ్మడి కుటుంబాలకు ప్రాముఖ్యత నివ్వడం లేదు. ఎందుకంటే ఎక్కువ ఖర్చు అని ఆలోచిస్తూ, ఒక్క బిడ్డను మంచిగా చదివించలని కొందరు, ఓపిక లేక కొందరు ఈ కాలం లో పెరిగిన ధరల వల్ల కొందరు ఇలా ఆలోచిస్తున్నారు తప్ప ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి అనేది మర్చిపోతున్నారు.

ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు ఉండేవి తాత నాన్నమ్మ అమ్మమ్మ,మామయ్య,బావ,మరదలు తోడికోడళ్ళు వదిన మరదలు,మేనత్త, మేన బావలు అంటూ ఇలా చాలామంది ఉండేవారు అలాంటి కుటుంబాలలో పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరిగేవారు, మంచి ఆహారం కూడా దొరికేది ఒకరు ఒక వంటకం చేస్తే మరొకరు మరో వంటకం చేస్తూ పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించే వారు.

అలాగే ప్రేమా ప్యాయతలు, పెద్దల పట్ల గౌరవం మంచి చెడులు తెలిసేవి పిల్లలైనా పెద్దలైనా వరుసలతో పీల్చుకునే వారు మరిప్పుడు మమ్ డాడ్ గ్రాండ్ ఫా ఒకవేళ ఉంటే అలా పిలుస్తున్నారు తప్ప నోరారా మామయ్య,అమ్మమ్మ,తాతయ్య అంటూ పిలవడం లేదు.అసలు పెద్దవాళ్ళు ఉన్నా వారిని అవసరము కోసం వాడుకోవడానికి తెచ్చుకుంటున్నారు ఇప్పటి యువ కుటుంబాలు , తప్ప ఉమ్మడి కుటుంబాలు అనేవి అసలు కానరావడం లేదు.

ఉమ్మడి కుటుంబాల లో ఇంకొక మంచి ఏంటంటే చిన్న పిల్లల ను జాగ్రత్తగా చూసుకోవడం ,కథల ద్వారా మంచి చెడు ,రామాయణ మహాభారతాలు వినిపించడం వల్ల వారిని సంస్కార వంతంగా పెంచడం జరిగేది అయితే ఇప్పుడు ఒక్కరే పిల్లనో పిల్లాడా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉద్యోగాల పేరిట వాళ్ళని పట్టించుకోకుండా పదిలేస్తున్నారు. అయితే బడి కి తర్వాత తుషన్ తర్వాత ఇంకేదో నేర్పిస్తూ వారిని పట్టించుకోవడం లేదు పైగా మంచి ర్యాంక్ రావడం లేదంటూ పిల్లల పై ఒత్తిడి తెస్తున్నారు.

ఇప్పటి చిన్న కుటుంబం పిల్లలు రామాయణ మహాభారతాలు వినకుండా కార్టూన్లు చూస్తూ అవే నిజమనే బ్రమలో ఉంటున్నారు తల్లులు కూడా అడ పిల్ల అయినా మగ పిల్లలకు అయినా తల్లిదడ్రులకు ప్రేమ దొరకడం లేదు పొద్దంతా ఆఫీస్ లో కష్టపడి వచ్చిన తల్లిదండ్రులు రిలాక్స్ అవుతున్నాను అనుకుంటున్నారు తప్ప పిల్లలతో తమ సమయాన్ని గడపలేక పోతున్నారు అనే విషయాన్ని వారికి తగిన ప్రేమను అందించలేక పోతున్నారు అనేది.

నిజం అందువల్ల చిన్న కుటుంబం మంచిది కాదు ఇప్పటికైనా యువత కళ్ళు తెరిచి తమ పిల్లలను తమ తల్లిదండరులను దగ్గరో లేదా అత్తమామల దగ్గరో పెంచడం లేదా వారినే తీసుకుని వచ్చి భారం అనుకోకుండా పెద్దల సమక్షంలో పిల్లల్ని పెంచడం మంచిది ఉమ్మడి కుటుంబాలు ముద్దు చిన్న కుటుంబాలు వద్దు అనేది నేటి నినాదం .

– భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *