ఉపాధ్యాయుడు అంటే

ఉపాధ్యాయుడు అంటే

1) బ్రహ్మ విష్ణు ఈశ బహు రూపు లు గురువు
   విశ్వ మంత నిండి విశదపరచు
   గురువు గొప్పదనము గుర్తెరింగిననాడు
   మానవాళి పొందుమహితసుఖము

2) వృత్తి ధర్మ మొకటి.భుక్తిధర్మమొకటి
   ఇరుగుపొరుగు వారు యిష్టపడగ
   అన్ని ధర్మ ములను అలవోకపాటించు
   మనసు నెరిగిమసలు మంచి గురువు

3) ప్రశ్న వేయు నేర్పు పసివార్కినేర్పాలి
   ప్రశ్న వల్ల మంచిఫలితముండు
   ఎందుకెప్పుడెట్లు ఏమిటీ దేనికీ?
   గురువు వల్ల ప్ర శ్నగుట్టుదెలియు

4) పిన్నవారినైనప్రేమతోపిలుచుచూ
   శుద్ధమాటచెప్పిబుద్ధిమార్చు
   గగనమంతకీర్తి.గర్వమేలేకుండు
   నట్టి తల్లి సమము ఆదిగురువు

5) బాధ్యతెరుగకుండ బడి యందు గురువులు
   గంట కొట్టు వరకు గడుపువారు
   తనకు చెప్పరాక తప్పించుకోజూచు
   బాధ గురువు వల్ల బోధకల్ల

– కోట

Related Posts