ఉప్పొంగద జీవితం

ఉప్పొంగద జీవితం

ఎడారిలా శిశిరం
ఎదగాయాల శిబిరం
చెరిపిస్తే సత్వరం
వదిలేయవ కలవరం

గానమై మిగిలావో
గేయమై మెరుస్తావు
వసంతాల వాకిలిలో
ఆశలే చిగురించును

అనుభవాల పూలతోటి
అనుభూతుల అభిషేకం
ఆలకించు మనసేమో
సంబరమై ఎగసిపడును

కలలన్నీ కాంతులవ్వ
కలతలన్ని ముక్కలవ్వ
ముక్కంటి ప్రేమగా
ఉప్పొంగొద జీవితం

పలకరిస్తె ప్రకృతిని
పులకించును పుడమితల్లి
నడిచిచూడు శాంతిబాట
నటనలన్ని మూటగట్టి

గతమెంతో గొప్పదే
రేపెంతో తీయనే
నేటినే మరచితివా
చీకటిగా మిగిలేవు

– సి.యస్.రాంబాబు

Related Posts