ఉత్తరాలతో నిండిపోతు…!!!
నరుడి బతుకు నటనే అయినా
పెరిగిన నాగరికథా నాణ్యతలో
మనుగడకు చోటులేక…!!
పొలిమెర దేవుళ్ళు చదునులై
పొగబెట్టుకు పోయిన పాతరోజుల
చిత్రాలు తరాలు మారిన చెదరని
తీపి గుర్తులే…
నిరంతరానికై నోళ్ళు తెరుచుకొన్న
తపాలా డబ్బాలు…
మంచి చెడుల సమాచారాలతో మానవ
వికాసాలను వృద్ధి చేస్తూ…!!
వేసిన ఉత్తరాలతో నిండిపోతు
సమాజాన ప్రతి మనిషిని గుర్తించేవి…
కలిమాయనో…
సెల్లుమాయనో తెలియదు…!!
రాసేవాడు లేక పాతరేయని అక్షరాల
సాధింపు ఆమోదముద్ర పొందని
జాబులుగా రూపుదిద్దుకో లేక
పోతున్నవి….
వేలితో గీసే రంగుటద్దము పై
మోజుతో అబద్ధాలను పలుకుతు…
కొలువు దీరని కొండంత ఢాంభికాలకు
ప్రదర్శణమవుతు…తపాల సంగతులు
చిత్తగింపులాయెను…
విలాసాల వికృతాలతో పొరలు
కమ్మిన సమాజానికి కదలని రంగు
డబ్బాలైనా…చెదబట్టిన మనస్సులను
చీపురుతో ఊడ్చలేక చిలుమూరుతు…!!
నిండని శూన్యం ఒలకబోసిన
తర్పణాలతో దిగబడి పోతున్నవి…
– దేరంగుల భైరవ