వాలకం

వాలకం

నిరర్థక ఆస్తుల్లా
అర్థం లేని జీవితం
చికాకుల కడలిలో
చిక్కుకుపోయింది

చిటుక్కుమనే చీమ
టప్పుమనే వానచుక్క
లగెత్తే గేదె
జీవితకాశంలో తారలు

గిరిగీసుకుంటూ జీవితాన్ని
ఆడిపోసుకుంటున్నాడొకడు
లోపలికి పోయిన డొక్కలు
చుట్టు వీడని చిక్కులు

లోకమే అంత
లోలకమై ఊగిసలాడమంటుంది
వాలకం చూస్తే
వాతాపి జీర్ణం అంటున్నట్టుంది

– సి. యస్ రాంబాబు

Related Posts