వడ్లగింజలో బియ్యపు గింజ

వడ్లగింజలో బియ్యపు గింజ

ప్రతి విషయానికి ఏదో ఒక మొదలు ఉంటుంది. అలా మొదలైంది ఎలా ముగుస్తుందో చెప్పలేం. అహం భావంతో వచ్చే పరుష మైన మాటలే తగాదాలకి మూలం. అలా మొదలవుతుంది తగాదా.
ఒకొక్కప్పుడు ఒక చిన్నమాట చిలికి చిలికి గాలివానైనట్లు కుటుంబాలు విడిపోయే పరిస్థితి వస్తుంది. అది ఎలా మొదలైందో వెనక్కి తిరిగి చూస్తే ఏమివుండదు. వడ్ల గింజలో బియ్యపు గింజ.

ఉదా :
భార్య : ఇవాళ్టి నుంచి పాత గొడవలన్నీ మరచి పోయి ప్రశాంతంగా ఉందామండి
భర్త : నువ్వుండనిస్తేగా!
భార్య : మీరుండనిస్తేగా!
భర్త : నీవు!
భార్య : మీరే!
భర్త : చాల్లే నోరు మూసుకో!
భార్య : మీరే నోరు మూసుకోండి!
భర్త : ఇక నుంచి ఎవరి బ్రతుకు వారిది.
భార్య : సరే ఇక నుంచి ఎవరి బ్రతుకు వారిది

ఇది అలా మొదలైంది

లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్రేమికుల చూపులు ఎలానో మొదలై పెద్దలు ఒప్పుకొన్నా లేకున్నా వివాహం జరిగిపోతుంది.
దుర్యోథనుని ఈర్ష్య,రాజ్య కాంక్ష,ద్రౌపదికి అవమానం అలా మొదలైంది కురు క్షేత్ర యుద్దానికి మూలం.
రామ రావణ యుద్ధం అలా మొదలైంది రావణుని దుష్టబుద్ధితో.

– రమణ బొమ్మకంటి

Related Posts