వగరు

వగరు

కచ్చి జామకాయలు, కచ్చి రేగుపళ్ళు ఇంకా పిందెలుగా ఉన్న ఉసిరికాయలు వాటితో పాటు అప్పుడే చిన్నగా కాసిన మామిడి పిందెలు, లేత ఓమన కాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో…

అయితే మా చిన్నప్పుడు మా ఊర్లోనే ఇంట్లో జామ చెట్టు ఉండేది. జామ చెట్టుకు తెల్లని పువ్వు పూసింది అంటే మాకు చాలా సంతోషం వేసేది ఎందుకంటే నువ్వే కదా చిన్న పిల్ల గా మారి జామకాయ గా రూపాంతరం చెందింది.

అది ఎప్పుడెప్పుడు కాయ అవుతుందా అని వేచి చూసే వాళ్ళం అది కాయగా అవ్వగానే వెంటనే తెంపుకొని తలో ముక్క కొరికే వాళ్ళం. మా అమ్మ మాత్రం అలా పిల్లల్ని తినకూడదు అంటూ మమ్మల్ని కాపాడేది అయినా మేము పిల్లలు రావడం ఆలస్యం తెంపుకుని తినేయడమే.

ఇక సంతోషి మాత గుడి దగ్గర పెద్ద రేగు పండ్ల చెట్టు ఉండేది ఆ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్లే వాళ్లు కాదు. ఎందుకంటే అక్కడ అ ఇంటి వాళ్ళు ఆ చెట్టు దగ్గరికి రానివ్వకుండా గోడలపై గాజు పెంకులు బుజ్జి ఉంచేవారు.

ఆ రేగు పండ్ల చెట్టు బొమ్మలు గోడ ఇవతలకి ఉండేవి… కొంటె కోణంగి గోళం మనం ఊరుకుంటామా బయటకు వచ్చిన కొమ్మలకు కాసిన కచ్చి రేగు కాయలను రాళ్లతో కొట్టుకొని మరీ తెచ్చుకునే వాళ్ళం.

అవి కింద మట్టిలో పడతాయి కాబట్టి ఇంటికి తీసుకువచ్చి నీళ్లలో కడిగి ఎన్ని వస్తే అన్ని సమానంగా అందరికీ ఆ రేగు పండ్లలో ఉప్పు అద్దుకుంటూ తినేవాళ్ళం. అబ్బా ఎంత వగరుగా ఉండేవో…

పచ్చి మామిడి కాయలలో ఉప్పు, కారంపొడి వేసుకుని తింటుంటే కొంచం పుల్లగా, కొంచం వగరుగా ఉండేవి. ఉసిరికాయలు అంతే చిన్న చిన్న ఉసిరికాయలు తెచ్చి వాటిల్లో ఉప్పు కారం లేదా ఉప్పొకటి అద్దుకుని తింటే పుల్లగా వగరుగా అనిపించేవి.

చింతకాయలు చిన్నగా ఉంటే వాటిని ఒమనగాయలంటారు వాటిని అలాగే తినేసేవల్లం. అబ్బో అప్పుడు ఎన్నెన్ని తిన్నామో ఇప్పుడవన్ని తల్చుకుంటే బాల్యం అందమైనది కదా అనిపిస్తుంది. ఇప్పుడు తింటే ఏమన్నా చిన్నపిల్లవా అంటూ వెక్కిరిస్థారు ఆ మాటోక వగరు గా ఉంటుంది.

– అర్చన

Previous post పండు వెన్నెల
Next post యథా బ్రహ్మండం, తదా పిండండం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *