వైకల్యత

వైకల్యత

నా,
వైకల్యము స్వీయము.

నాది,
అలసట ఎరుగని
ప్రయాణము.
నింగి, నేల హద్దులై,
ఆమె కొరకై నే చేసే
ఈ ప్రయాణంలో,
అందమైనవి నన్ను ఆకర్షించవు.

ఆమెలో
నే చూడాల్సినది
వాస్తవికత.

నా
వైకల్యము స్వీయము.
నేను
అబద్ధానికి,
గుడ్డి, మూగ, చెవిటిని.

నీ నవ్వు,
నీలోని నువ్వు
ఒకటే అయితే
అదే అద్భుతమైన
అందమే సఖి……..!

నాది కాదే
దీనికి వైకల్యత………!

– వాసు

Related Posts