వలస కూలీలు

వలస కూలీలు

పనులపరుగులాటతో
పల్లె వొదిలి పరుగు తీసే
సాగిపోయే నిత్య శ్రామీకు లే
వలస కూలీలు?

కూటికోసం కూలి చేస్తూ
నగరాల చాటున చితికిన
బతుకులు వలసకూలీలు

ఉపాధి అవకాశాలను ఎక్కడా అని రెక్కల కష్టం
నమ్ముకొని బతుకుతున్న
భారజీవులు వలస కూలీలు

చిత్ర విచిత్రాల సీమలో
భాష తెలియని వేషమైనా
ఫ్యాక్టరీల పొగలలో పోరు
పడుతూ పోరాటమే చేస్తున్నది వలస కూలీలు

గుంతలు పూడ్చినా మార్గాలే కాని జీవితపు రహదారి లేని జీవితాలు
వలస కూలీలు

బండలెత్తి బరువు లెత్తి
కండ కరిగిన సాములైన
వెతల జీవుల కథలు
మారని మనుషులే
వలస కూలీలు

కాలం కలిసిరాక కరువు
పీడించిన ఆకలి కడుపుల
కేకలు సొంతవూరు దాటిన
అభాగ్యులు వలస కూలీలు

నడకేనమ్ముకొనిపట్టువదలని విక్రమార్కుడిలా అలసి సొలసి కన్నీటి వ్యధల గాలి మేడల చూపులు వారే
వలస కూలీలు

తల్లడిల్లిన ప్రాణమైన
తనవారికోసం తపన వదలక భానిసత్వపు
బాధ కోర్చి బతుకు నీడ్చే
వలస కూలీలు

ఆకాశమే అటువచ్చినా
తరాలు మారినాతలరాతలు
మించినా “గ్రహాలు”దాటినా
సోనూ సూద్ లు వచ్చినా
వోటు బ్యాంకు ల వరాలు
గుప్పినా అంతులేని ఆగని
భరోసా లేని బడుగుజీవులు
వలస కూలీలు ……..?

– జి జయ

Related Posts