వాలు జడ

వాలు జడ

 వాలు జడ

 

శాంతి కి పెద్దగా ఉన్న వాలుజడ అంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడు తిరుపతి లో తలనీలాలు ఇచ్చాక కాస్త పెరిగాయి కానీ ఆ తర్వాత శాంతి కాలేజీకి వెళ్తూ పిన్నిసులు, క్లిప్ లు పెట్టుకుంటు జడను పాడు చేసుకుంది. వాళ్ళ అమ్మగారు అలా చేయొద్దు అని చెప్పినా వినేది కాదు.

అలా జడ అంతా చిన్న పిలకలగా అయ్యింది.మరి పెద్దవారు మాటలు వినకపోతే అంతే కద, అందుకే శాంతి జడ అలా పిలక లాగా తయారయ్యింది.

 కొన్నాళ్ళ తర్వాత శాంతికి జుట్టు పెంచుకోవాలి అనే కోరిక పెరిగింది. అది కూడా లాక్ డౌన్ లో ఏం పనిలేదు కాబట్టి జుట్టు పెంచుకునే మార్గం కోసం చేతిలో ఉన్న ఫోన్ లో యూ ట్యూబ్ ఛానెల్ లో జుట్టు పెంచుకోవడం ఎలా అనే వీడియో లు సెర్చ్ చేసి అన్ని చూసింది.

చాలామందికి పెద్ద పెద్ద జడలు ఉండడం చూసి వాళ్ళు చెప్పే చిట్కాలు పాటిస్తే తనకు కూడా అలాంటిదే జుట్టు పెరుగుతుందని ఆశించింది.

అందువల్ల వాళ్ళు చెప్పినట్లుగా అన్ని రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంది. అనుకున్నదే తడవుగా ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఏది చెప్పినా పాటిస్తూ, వాళ్ళు చెప్పినట్టుగానే అన్ని రకాలుగా నెత్తికి పెట్టేది.

ఇదంతా గమనిస్తున్న వాళ్ళ అమ్మగారు ఇలా పెట్టుకోవడం వల్ల ఉన్న జుట్టు కూడా రాలిపోతుంది వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా శాంతి వినకుండా నాకు జుట్టు మూలిస్తే నీకు కుళ్ళు అని తల్లిని ఎదిరించి మరి తమ్మున్ని బయటకి పంపి అన్ని రకాలుగా తెప్పించుకుంది.

ఆయుర్వేద షాప్ అని కాకుండా ఏ నూనె పడితే ఆ నూనె కూడా పెట్టుకో సాగింది ఎందుకంటే శాంతికి వాలు జడ అంటే చాలా ఇష్టం దాంతో తన తమ్ముడితో బయటకు పంపించి మరి తల్లికి తెలియకుండా రకరకాల పొడులు, నూనెలు తెప్పించుకుంటూ ఉండేది. తనకు చాలా పెద్ద వా లుజడ ఉండాలని ఆమె ప్రగాఢ కోరిక.

జుట్టు పెరగడం తప్ప మరొక ఆలోచన కూడా చేయలేదు 24 గంటలు జుట్టు ఎలా పెంచుకోవాలి అనేదే ఆమె ఆలోచన దాంతో ఎవరు చెప్పినా కూడా అన్ని చిట్కాలు పాటించేది.

ఎన్ని రకాలు అంటే గంజి పెట్టమంటే గంజి పెట్టుకుంది బియ్యం కడిగిన నీళ్లు పెట్టుకోవాలంటే బియ్యం కడిగిన నీళ్లు కూడా పెట్టుకుంది. పెరుగులో నిమ్మకాయ వేసి పెట్టుకోమన్న పెట్టుకుంది.

చివరికి ఆవాలు ముద్దగా నూరి పెట్టుకోవాలి అని చెప్పినా కూడా ఆ పని కూడా చేసింది. ఇలా యూట్యూబ్లో ఎన్ని విధాలుగా జుట్టు పెరగడానికి చిట్కాలు ఉన్నాయో అన్ని చిట్కాలను శాంతి పాటించింది.

అయితే ఇన్ని చేసినా కూడా శాంతి వెంట్రుకలు ఒక్క ఇంచ్ కూడా పెరగలేదు పైగా ఏ కాలంలో పడితే ఆ కాలంలో అన్ని రకాలుగా పెట్టుకుంది కాబట్టి ఆమెకు ఒకవైపు ముక్కు మూసుకుపోయి గాలి పీల్చడం చాలా కష్టమైంది. ముందే కరోనాకాలం అందులోనూ గాలి పీల్చడం రావడం లేదు అంటే ఇంట్లో వారందరూ చాలా భయపడ్డారు.

ఇక భరించలేను అని అనుకున్న సమయంలో వాళ్లు హాస్పిటల్కి వెళ్లారు అక్కడ హాస్పిటల్ వాళ్ళు స్కానింగ్ లని టెస్టులని ఏవేవో చేసి 20 30 వేలు బిల్లు వేసి చివరికి ఆపరేషన్ చేయాలి. లక్ష రూపాయలు అవుతాయి మళ్లీ మూడో లాక్ డౌన్ పెట్టిన మీరు తప్పకుండా రావాల్సిందే అంటూ డాక్టర్ వారిని భయపెట్టాడు.

డాక్టర్ చెప్పిన విషయం విని షాక్ అయింది శాంతి. శాంతి లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తెస్తుంది. పైగా వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం అందులోనూ లాక్ డౌన్ డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి లక్ష రూపాయలు అంటే వాళ్లకు చాలా ఎక్కువ ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో, హాస్పిటల్ లో ఇచ్చిన మందులు వాడుతూనే,

వాళ్ళ తమ్ముడు రెండో ఒపీనియన్ తీసుకోవడానికి వాళ్ళ స్నేహితులకి ఫోన్ చేశాడు అప్పుడు ఒక స్నేహితుడు ఆయుర్వేదం లో అల్లోపతిలో చాలా పద్ధతులు ఉన్నాయి ఒకసారి వెళ్లి కలవండి అని చెప్పాడు. అయితే కలవడం కష్టం కాబట్టి ఫోన్ల ద్వారా విషయాన్ని వాళ్ళ తమ్ముడు చెప్పడంతో ఆయుర్వేదం అయితే చాలా ఆలస్యం అవుతుంది. అలాగే మీ అక్కగారు భరించగలిగే శక్తి కూడా ఉండాలి. మీరు అల్లోపతి ప్రయత్నం చేయండి అని ఆయుర్వేద వైద్యుడు చెప్పాడు.

దాంతో వాళ్ళ తమ్ముడు అల్లోపతి వైద్యురాలికి ఫోన్ చేశాడు అప్పుడు ఆవిడ సమస్య అంతా విని మీరు ఆయుర్వేదం అల్లోపతి ఇవేవీ కాకుండా కోఠీ e.n.t హాస్పిటల్ కి వెళ్ళండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సన్నీ మంచిగా చూస్తున్నారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని సలహా ఇవ్వడంతో తమ్ముడు తన అక్కని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాడు.

ఇక్కడ శాంతి ఏమో ఊపిరి ఆడక ఆడకుండా సతమతమవుతుంది. పైగా మాస్కోకటి ఆ పైన చల్లగా ఉండకుండా స్కార్ఫ్ కట్టుకొని మొత్తం మొహమంతా మూసుకోవడం వల్ల గాలి ఆడక ఆమె ఉక్కిరిబిక్కిరి అవసాగింది. హాస్పిటల్ కి వెళ్ళేసరికి అక్కడ చాలా పెద్ద లైన్ ఉండడం వల్ల ఈరోజుకి కాదు అని అనుకున్నారు. కానీ శాంతికి ఏమో ఎప్పుడెప్పుడు ఆపరేషన్ చేస్తారు తనకి ఎప్పుడెప్పుడు తగ్గిపోతుంది అన్న ఆలోచనతో బాధపడుతూ ఉంది.

చివరికి తన వంతు వచ్చింది. డాక్టర్ తనని చూసింది అప్పటికే తీయించుకున్న స్కానింగ్ లు రిపోర్ట్లు అన్ని చూపించింది శాంతి అయితే అవన్నీ చూసిన డాక్టర్ ఎవరు ఇది తీసింది అంతా ఉల్టా తీశారు. అంటే తిట్టి ఒక నాలుగు రకాల గోలీలు ఇచ్చి రాసి పంపించింది. కానీ శాంతికి చాలా కోపం వచ్చింది నా బాధ ఏమిటి అర్థం కావడం లేదు. నాకు తొందరగా ఆపరేషన్ చేస్తే బాగుండేది అని అనుకుంది కానీ ఆ డాక్టర్ అలా చేయకుండా ఒక మూడు సార్లు తిప్పించుకొని అవే గోలిలు మారుస్తూ మళ్ళీ మళ్ళీ ఇచ్చేది.

ఆ గోలీల ప్రభావం చాలా ఉండేది రెండు రోజులు వాడేసరికి శాంతి ముక్కు కాస్త తగ్గింది. లోపల నిండిపోయిన చీమిడి మొత్తం తుమ్ముల రూపంలో బయటకు వచ్చింది. అయితే ఇదంతా శాంతి పెట్టుకున్న పెరుగు నిమ్మకాయ వివిధ రకాలైన చిట్కాల వల్ల నిమ్ము అంతా చేరి ముక్కులో నిండిపోయింది అందువల్లే ఆమె ఊపిరి తీసుకోలేకపోయింది.

శాంతి పడిన బాధ వర్ణనాతీతం ఆమె ఒక సైడు గాలి పీల్చుకుంటూ తెల్లార్లు నోరు తెరుచుకొని పడుకునేది. ఓవైపు వేడి వచ్చేది అలాగే ఓవైపు చల్లగా అనిపించినా ఫ్యాన్ వేసుకుని పడుకుంటే తప్ప ఆమె నిద్రపోయేది కాదు. తెల్లార్లు చీదలేక ముక్కు ఎర్రగా మారింది. పైగా నోరు తెరుచుకొని పడుకోవడం వల్ల నోరంతా ఎండిపోవడం మధ్య మధ్యలో లేచి నీళ్లు తాగడం ఆ నోరు నిండిపోయి ఎండిపోయిన నోరు తిరిగి మామూలుగా అవ్వడానికి ఎంతో అవస్థ పడేది.

అయితే హాస్పిటల్ లో డాక్టర్ గారు ఇచ్చిన గోలీల వల్ల చాలావరకు నయమైంది. వరుసగా మూడు వారాలు వెళ్ళింది అంతే. ఆ మూడు వారాలలోనే ఆమె సమస్య తీరిపోయింది ఆపరేషన్ చేసే అవసరం లేకుండా మందులతోనే నయం చేసింది ఆ డాక్టర్. చివరి రోజు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు కనిపిస్తారేమో ధన్యవాదాలు చెప్పాలని శాంతి బాగా అనుకుంది. కానీ ఆ డాక్టర్ గారు కనిపించలేదు ఇక ఏమీ చేయలేక శాంతి తిరిగి ఇంటికి వచ్చింది.

ఇప్పుడు శాంతికి పెద్ద వాలుజడ కావాలనే కోరిక లేదు అలాంటి వీడియోలు వచ్చిన శాంతి చూడదు. ఎవరైతే చిట్కాలు పెట్టారో మేం వాడుతున్నాం అంటూ మనకు చూపించారు. వాళ్ళందరికీ శాంతి తిట్టుకుంటూ మెసేజ్ లు చేసింది. మనుషులను డబ్బు కోసం ఇలా బలి చేస్తారా అంటూ వారిని ప్రశ్నించింది.

అయితే దీనికంత మూలం ఏంటంటే శాంతి వాళ్లు కూడా కావాలని కోరుకోవడం, దానికి తగిన ఆహారం తీసుకోకపోవడం, పైగా చిట్కాలు వాడడం సరైన ఆహారం తీసుకుంటూ, ఏ ఒత్తిడి లేకుండా ఉంటే జుట్టు తనంతట తానే పెరుగుతుంది. ఇలాంటివి వాడాల్సిన అవసరం ఉండదు. అనేది శాంతి చాలా ఆలస్యంగా గ్రహించింది.

ఈ కథలో నీతి ఏంటంటే యూట్యూబ్లో చూసేది ప్రతిదీ మనం చేయకూడదు వాళ్ళు డబ్బు కోసం ఏది పడితే అది చేసి ఒకవేళ అది భాగవకపోతే సమస్య మాది కాదు మీది అని మన పైన వేస్తారు.

ఒక జుట్టు విషయంలోనే కాదు వంట మిగిలిన విషయాల్లో కూడా అందరూ ఇలాగే చేస్తారు డబ్బు కోసం ఏదైనా చేసే రోజులు ఇవి కాబట్టి ఒత్తిడిని తగ్గించుకొని. మంచి ఆహారం తీసుకుంటూ, మంచి వ్యాయామం చేస్తూ, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు తనంతట తానే పెరుగుతుంది. అలాగే మరొక విషయం ఏమిటంటే వంశ పారంపర్యంగా కూడా జుట్టు అనేది ఉంటుంది.

కానీ శాంతి వాళ్ళ అమ్మకు జుట్టు బాగానే ఉండేది. అయితే శాంతికి వాళ్ళ తల్లి తండ్రుల పోలికలో లేదా మేనత్తల పోలికలు లేదా నానమ్మ పోలికలో వచ్చి ఉంటాయి. అందుకే శాంతి జుట్టు పెరగలేదు. పైగా ఆవిడ చాలా ఒత్తిడిలో ఉంది. అందుకే ఎన్ని చిట్కాలు పాటించిన కూడా ఆమె జుట్టు పెరగలేదు అనేది వాస్తవం.

మీరు కూడా యూట్యూబ్ లో ఏది పడితే అది చూసి పాటించకండి. మీరు సొంతంగా వాడిన తర్వాత మీకు బాగా అనిపిస్తేనే వాడండి, కొందరైతే కాఫీ పొడిలో తేనె వేసి మొహానికి మాస్క్ వేస్తారు. ఇంకొందరు ఇంకెన్నో చెప్తారు. అవన్నీ పాటించడం, పాటించకపోవడం అనేది మన విజ్ఞత.

ఇప్పుడు శాంతి మాత్రం చిన్న పిలక చుట్టుతో జుట్టు వేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత శాంతి ఎప్పుడూ యూట్యూబ్ లో జుట్టు ఎలా పెరగాలి అనేది చూడనే లేదు.

వాలుజడ అంటే అందరికీ ఇష్టమే కానీ అది జన్మతా రావాలి తప్ప ఏవేవో చేస్తే రాదు అనేది గ్రహించగలగాలి.

 

భవ్యచారు

నీరజ Previous post బేతి మాధవి లత
పింగళి వెంకయ్యగారు Next post పింగళి వెంకయ్యగారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close