వాన
వాన రావాలని ఆరాటపడే హృదయం రైతుది
దేశానికి అన్నం పెట్టాలని సంకల్పంతో
వచ్చిపోయే వాన కోసం ఎదురు చూస్తూ
పాడిపంటలు చిగురించేను
పశు పక్షాదులకు నర్తించేను
జనుల దాహర్తి తీరేను
వాన మొక్కలకు జీవనాధారం
నేలపై జీవిస్తున్నా జీవులకు ఆధారం
వాన చినుకులతో ఆడుతూ పాడుతూ
పిల్లల ఆనందానికి అవధులు లేవు…
వాన ప్రతి చినుకు భూమిపై పడుతుంటే
ఆ మట్టి వాసన నాలో ఒక అనుభూతిని కలిగించింది..
ఒకసారి మనందరి కోసం వచ్చిపోయే వాన
వాన పడిన అనంతరం ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది..
వాన చినుకులతో స్నేహం చేస్తే
అది ఎప్పటికీ మరవలేని క్షణం అవుతుంది…
-మాధవి కాళ్ల
చక్కటి కవిత వ్రాసారు.