వాన రాక పానం పొక

వాన రాక పానం పొక

తెచ్చిన పళ్ళన్నీ నీళ్లపాలు అయేతినడానికి రమ్మంటే పిల్లలు అచ్చి ఎన్ని రోజులని ఆ పళ్ళు తింటారు.ఆపిల్స్,ఆపిల్స్ అని అమ్ముకుంటూగల్లీ గల్లి తిరుగుతూ అమ్ముకునే నేను పిల్లలకు ఎన్నాళ్ళని పళ్ళుపెట్టీ కాపాడుకోవాలి.

నాలుగు రోజులూ అయిపాయే బోణీ లేకపాయే, బయటకు పోదామంటే ఈ వాన ఆగక పాయె, పొరల్లు మల్ల ఈయ్యాల కూడా పళ్ళు తినమంటేమొఖాలు ముడుసుకో నుండ్రి, పబు త్వం ఇంటి నుండి కాలు బయట వెట్టకుర్రి అన్నా , బతుకు బండి లాగలంటే పోక తప్పది.

ఇక తప్పక ఏమైతే అదయ్యిందని బండికన్ని కవర్లు కట్టి, పిల్లలకు ఒక్క పూటైనా ఉడుకుడుకు బువ్వ వెట్టలని రోడ్డు మీదికి వస్తె అరె ఎక్కడ జుసిన నీళ్ళే కాన రాబట్టే ,ఎక్కడ గుతుంతలు ఉన్నాయో,ఎక్కడ కరెంటు తీగలు ఉన్నాయో తెలియక ప్పాయే.

అయినా పిల్లల ఆకలి తిర్వాలని బండి ముందుకు నుక్కున్న, ఆపిల్స్ ఆపిల్స్ అంటూ గొంతు చించుకుని అరుస్తున్న ఒక్కడూ అచ్చి కొనక పోయే, ఏమి జేతు వానాల ఏన్ని గల్లిలు అని తిరగాలే కాళ్ళు గుంజ వట్టే , ఇగ ఒక్క గల్లి తిరిగి పోదామని ఆ గల్లి లోకి ఆపిల్స్ ఆపిల్స్ అనుకుంటా పోతి ,

ఓ అవ్వ బంగ్లా లోంచి పిలిచే అవ్వ బేరం తగిలిందని ఆశ పడుకుంటా పళ్ళు తీసుకుని లోపలికి పోతే , ఆ అవ్వ పళ్ళు తీసుకుని ,ఇన్ని బియ్యం సరుకులు ఉన్న మూట ఇచ్చి,

కొన్ని పైసలు కూడా చేతికి ఇచ్చి , ఇగో నా మొగుడు కూడా పళ్ళ వ్యాపారి కాకపోతే మేము దుకాణం ల పెట్టీ అమ్ముతం, ఈ వానకు దుకాణం కే ఎవరు అస్థలేరు నీ దగ్గర ఎవరు కొంటారు.

అని పాపం అని ఇచ్చిన, పో ఇగ ఇంటికి పోయి వాన అగినంక అచ్చి అమ్ముకో అంటూ చెప్పే , ఆ అవ్వ ఏ కన్నతల్లి బిడ్డో అన్నపూర్ణ తల్లి లెక్క కరుణించే ,

అవన్నీ పట్టుకుని ఆమెకు దండం బెట్టి , ఉరుక్కుంట ఏనక్కి వచ్చి ముందుకు పోతా వెనక్కి సుస్తే ఆ బిల్డింగ్ లేదు అక్కడ ఏం లేదు .

నెత్తి గొరుక్కున్యా ఇంటికి అచ్చినా , నా పిల్లలకు వండి ఉడుకుడుకు బువ్వ బెట్టి, పొరల్లను ఏసుకుని రాత్రి పడుకుంటుంటే గోడకున్న లక్ష్మి దేవమ్మ నవ్వుతూ కనిపించే….

 

-భవ్యచారు

Related Posts

2 Comments

  1. నిజ జీవితంలో జరిగిన కధలా ఉంది.

  2. నిజ జీవితంలో జరిగిన స్టోరీలా ఉంది..
    బాగుంది.👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *