వరుణ దేవా
వరుణ దేవా ఇకనైనా కారుణించవా…
రోహిణి కార్తెలో భానుడి విశ్వరూపాగ్నిజ్వాలతో..
నిప్పులు చిమ్మే కిరణ తాకిడికి రోళ్లు సైతం పగిలిపోయే..!!
మృగశిర కార్తె ప్రారంభమయ్యే.!!
ఇంకనూ భానుడి వేడి తగ్గకపాయే ..!!
ప్రకృతి మాత నీ చల్లని
చినుకుల పైరగాలికి సేద తీరుతానన్నట్లు నీ రాక
కోసం చూడబట్టే..!!
భానుడి వేడికి భూమాత
ఉడికి ఉడికి ఆవిరైపోతూ
నీవు ఎప్పుడొచ్చి వర్ష
ధారతో అభిషేకిస్తూ
చల్లబరుస్తావో ఏమోనని
నింగికేసి చూడబట్టే..!!
తొలకరి చినుకు కోసం రైతన్నలు ఏరువాక సాగించడానికి సన్నాహాలు చేయబట్టే..!!
నీ రాక కోసం జనులంతా
సూర్య కిరణ తాకిడికి అల్లకల్లోలం అవుతూ..
నీలి మబ్బులు ఎప్పుడు నల్లబడి గర్జిస్తూ ఉరుముతూ.. వర్షిస్తాయేమోనని చూడబట్టే..!
చుట్టంలా వచ్చి చూసి పలకరించి వెళ్ళిపోతావేమోనని..
“వచ్చి పోయే వాన”
కోసం పిల్లలంతా ఎదురు చూడబట్టే..
దయవుంచి ఇకనైనా కరుణించవయ్యా వరుణ దేవా.. 🙏
-భేతి మాధవి లత