వసంతాలమై దారి చూపుదాం

వసంతాలమై దారి చూపుదాం

శుభకృత్ నామ సంవత్సర
శుభ ఉదయాలు
కావాలి…..
విరాబూసిన హృదయాలు

చిరుగాలి సవ్వడి
మలి వెచ్చని కిరణాలు
లేత ఆకు పచ్చని తోరణాలు
కోకిల కుహ కుహ లు
చిన్ని పిచ్చుకల కిచ కిచ లు
వేప పూల వెన్నెల లు
చిలిపి మామిడి పులుపు
చెంత నే ఉన్న చింత
అన్నా….. ఎలా చింతా….
చేరువులో నే చెరుకు తీపి
ఉన్నా… అన్నా….

పదాల విరుపులు
పసి పాప పెదాల
చిరు నవ్వుల పెన్నిధి
అనంత విశ్వ నాధుని సన్నిధి లో
మానవత్వమే పరమావధిగా
ముందు తరాలకు వెలుగు బాటల
వసంతాల మై
దారి చూపే దివిటి ల మై
దారి చూపుదాం…
ప్రకృతి లో లీన మై
జీవిద్దాం సొగసు గా
దేర్యం గా….

అందుకే
మనమందరం……
సదా అనందంగా, ఆరోగ్యంగా
ఉండాలని కోరుకుంటూ…..

పూజ్యులు, పెద్దలు,మిత్రులు,పిన్నలు మరియు
ప్రియమైన ప్రతి ఒక్కరికి
శుభకృత్ నామ ఉగాది పండుగ
శుభాకాంక్షలు

అల్లాఉద్దీన్

Related Posts