వయస్సు

హాయ్ అంది వాసవి

హలొ అన్నాడు వాసు

మీ పేరు బాగుంది అండీ వాసవి అంటే సరస్వతి దేవి కదా అన్నాడు వాసు. అవునండీ అంది వాసవి మీరు ఏం చేస్తారండి తిరిగి అడిగాడు వాసునేను బాంక్ లో పనిచేస్తాను అంది వాసవి

. అవునా నేను ఓక టీవీ ఛానెల్ లో పని చేస్తాను అండీ అన్నాడు వాసు అలాగ మంచిదండి అంది వాసవి. ఇంతకీ మీ వయస్సు ఎంతoడి అడిగాడు వాసు. ప్రశ్న వినగానే చిరాకు వచ్చేసిoది.దాంతో ఆన్లైన్ లో నుండి బయటకు వచ్చేసింది.

పై సంభాషణ అంత ఒక సోషల్ మీడియా లోని ఒక యాప్ లో జరిగింది.ఏంటో జనాలుముఖ్యాoగా మగవారు అయితే మరీ అడుగుతారు.నిజంగా ఎందుకు అడుగుతారో ఏమిటోముందు అంత బాగానే మాట్లాడతారు. తరువాత మొదలవుతుంది అసలు సమస్య మీ వయస్సు ఎంత అని అడుగుతారు.

అంటే వయసు తెలియకపోతే మాట్లాడారాపోని ఎందుకు అని అడిగితే మీరు ఫీల్ అవుతున్నారా మీరు పెద్ద అయితే మీ అనుభవాలు తెలుసుకుందాం అనిలేదంటే మీకన్నీ తెలుసు కదా మీ సలహాలు తీసుకుందాం అని అడిగాను అని వెర్రి నవ్వు నవ్వుతూ అంటారు వెధవలు.

అసలు వయస్సుకి మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందానీకు అవసరమైన సలహా ఏదైనా ఉంటే అడుగులేదా నీ సమస్య ఏమైనా ఉంటే చెప్పుఅంతే కానీ మీరు పెద్దవారాఅనుభవం ఉన్న వారా అని అడగకు

అంటే అనుభవం అంటే నీకు oదులో అనుభవం ఉన్న వారు కావాలి అసలు అలా అంటారా ఎవరైనా ఒక ఆడదాని తో నీకు అనుభవం ఉందా అంటే ఆమె  ఉరుకుంటుందా అదే వాళ్ళ అక్కనో చెల్లినో అలా ఎవరైనా మాట్లాడితే  వాళ్ళు ఉరుకుంటారా అంటే ఆన్లైన్ లో అన్నలుతమ్ముళ్లు ఉండరు కాబట్టి ఎంత మాట అయినా అడుగుతారా అండీ..

అవును ఒక మాట మగవాళ్ళు ఆడవాళ్ళని అది కూడా  సోషల్ మీడియాలో పరిచయం అయిన వారినే అలా అడుగుతారాలేదంటే అందర్నీ అలానే అడుగుతారా వాళ్ళ పక్కింటి వాళ్ళనివాళ్ళ ఎదురింటి వారిని కూడా అలానే అడుగుతారా ఎంటో మరి మనం అంటే మన ఆడవాళ్లు అలా మగ వాళ్ళని అడుగుతారా  మీ వయస్సు ఎంత అని ఏమో నేనైతే అడిగను మరి.

మీకు ఇష్టం ఉంటే మాట్లాడండిలేదంటే వదిలెయ్యండి.మిమల్ని మాట్లాడమని మేమేమి అడుక్కోలేదు కదా మిరే కావాలని మెసేజ్ లు చేస్తారు.మాట కలుపుతారు.మేమేదో గౌరవిస్తూ మాట్లాడితేకాస్త చనువుగా మాట్లాడితే ఇక నువ్వునువ్వు అని అంటారు. ఒక వేళ సపోజ్ఫర్ సపోజ్ వాళ్ళ చెల్లినోఅక్కనోఅలా ఎవరైనా అంటేఅలా మాట్లాడితే వీళ్ళకి విషయం తెలిస్తే ఎలా ఉంటుందoటారు.

ఇదిగో నేను అన్ని నిజాలు చెప్తున్నా అని నాతో మాట్లాడకుండా ఉండకండే ఇవ్వన్నీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు కాబట్టి మీతో కాస్త పంచుకుందాం అని వచ్చిచెప్పాను అంతే తప్పా ఇంకేమి లేదండి.అవునుమనలో మన మాట అలా మగవాళ్ళు ఎందుకు అడుగుతారో తెలుసా

వారికి మనం సూట్ అవుతామో లేదో తెలుసుకోవడానికి అంటకాదా అయితే మీకు తెలిసిన విషయం నాతో పంచుకోండి.అమ్మో మేనేజర్ గారు పిలుస్తున్నారు.మళ్ళీ కలుద్దాం అండీ అంటూ కేబిన్ లోకి వెళ్ళింది వాసవి. నేను నవ్వుతూ బయటకు వచ్చేసాను

Related Posts

2 Comments

  1. చాలా చాలా బాగుంది మేడం… sorry..medam🙏🙏🙏💐💐💐.,.👌👌👌

Comments are closed.