వేచి చూస్తున్నాను
వసంత కాలంలో కొత్తగా చెట్లు చిగురుస్తుండగా
తెల్లవారుజామున ఆ చెట్లు మీద మంచును చూస్తుంటే
కొత్త ప్రదేశాన్ని చూస్తున్నట్టుగా ఒక అనుభూతి కలిగింది..
పువ్వులు అందంగా వికసించి నవ్వుతున్నాయి..
పూల తోటలో పడిన మంచుని చూస్తూ ఉంటే
అది కళ్ళకు మనోహరంగా కనిపించింది..
మనసు ఎందుకో ఆందోళనకు లోనవుతూ ఉండగా
జాబిల్లి వెలుగులో అతన్ని నీడని చూసిన కానీ
మొహం మాత్రం కనిపించలేదు..
అతన్ని గొంతు నుండి మధురమైన గానం నాకు వినిపిస్తుంది..
అతను ఎవరా అని వెతకడం మొదలు పెట్టాను..
కానీ ఆ గానం నా మనసు లోతులోకి వెళ్లి
నన్ను ఏదో తెలియని ఒక పరవశానికి లోనయ్యాలా చేసింది..
మనోహరమైన అతని గానం విన్నా ప్రతిసారి
అతన్ని చూడాలని నా హృదయం ఎంతో ఆరాటపడుతున్నా క్షణాన
అతన్ని కలవాలని నేను ప్రయత్నం చేసి ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి
ఆ బాధకి నా కన్నీళ్లే సాక్ష్యం అయ్యాయి…
అతన్ని నా మనసులో నేను ఆరాధించిన ప్రతిసారి
అది కొన్నాళ్ళకి ప్రేమ అని తెలుసుకొని
అతనికి చెప్పలేక నాలో నేనే
ఉక్కిరి బిక్కిరి అయిన క్షణాలు ఎన్నో…
అతనికి నేను ఎదురు పడే క్షణం కోసం వేచి చూస్తున్నాను..
నేను నీకు తెలియని ఓ ప్రియురాలుగా
నీ జీవితంలో మిగిలిపోతాను…
– మాధవి కాళ్ల