వెదజల్లు సామరస్యపు మకరందపు సోదరభావం

వెదజల్లు సామరస్యపు మకరందపు సోదరభావం

శ్వేత వర్ణపు సొగసుతో నీలాకాశంలో స్వేచ్ఛా విహంగమై విహరిస్తున్న శాంతి కపోతం నేడు రక్తపు ధారలతో తెగి పడిన రెక్కలతో నేలకొరిగే నిర్జీవపు దేహమై….

అడుగడుగున మతోన్మాదంతో మానవత్వం మరిచి మృగాల వలె విచక్షణ కోల్పోయి కల్లోల హృదయాలతో ఊగిసలాడుతు శాంతిని త్యజించి జీవిస్తున్నం జీవచ్ఛవలమై…..

అణ్వస్త్ర ప్రయోగాలు అణ్వాయుధాలతో శాంతిని ఆస్వాదించలేమనే నగ్న సత్యాన్ని గ్రహించలేక పోతున్నాం పామరులమై……

ఆధిపత్య పోరులో ఆత్మసంతృప్తిని మరచి జీవిస్తున్నం మరమనుషులమై….

గాంధీ మహాత్ముడు అఖండ భారతావనికి స్వాతంత్ర్యం సంపాదించే శాంతి ఆయుధమై….

ఇంకా ఎందరో మహోన్నత వ్యక్తులు శాంతి పథంలో నడిచి నిలిచే విశ్వానికి ఆదర్శమై…

శాంతిని వెదజల్లి మకరందపు సోదరభావంతో నిలువు చరితలో…..

అఖండ భారతమా అనునిత్యం ప్రతిఒక్కరిలో సోదరభావం వెదజల్లు మకరందమై…

విశ్వశాంతికై గగనంలో శాంతి కపోతం స్వేచ్ఛ వాయువులతో వివరించేటట్టు స్నేహహస్తం అందించు….

శాంతి పథంలో నీ ప్రస్థానం మహోజ్వలమైనదని చాటిచెప్పు విశ్వానికి…..

– కొత్త ప్రియాంక (భానుప్రియ)

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *