వేదన

వేదన

వేదనెందుకు నీకు ?
వల్లె వేయుటకు అది
వేదము కాదు!
నీవు జీవివి.
నిర్జీవివి ఆనుకుంటే
రాబందులు నీ చుట్టుముట్టు !
చీకటి మయము కాదు
నీ జీవితం
ఒక రోజులో అర్ధభాగం
అంధకారము కాదా ?
చీకటిలో వెలిగించు
చిరు దివ్వెను
కాంతిని గాంచు.
నీ కన్నుల నిండుగా !

– వాసు

Related Posts