వేదన

వేదన

అత్యంత ఆత్మీయులు,
అమూల్యమైన వస్తువులు,
అతి ముఖ్యమైన పనుల వల్లే
వేదన,అవేదనలకు లోనవ్వుతారు.
వేదన చాలాసార్లు ఎక్కువ 
ఆశించినప్పుడు,మన అనేది కోల్పోయినప్పుడు కలుగుతుంది.
వేదన ఒక విధంగా అత్యంత ఎక్కువ ప్రేమ వల్ల కూడా చోటు చేసుకుంటుంది.
కొన్ని సందర్భాల్లో,కొన్ని పరిస్థితుల్లో
వేదన , బాధ నుంచి ఆలోచనలకు మారే
అవకాశం వుంటుంది.
రాయి రాయి రాపిడి వల్ల నిప్పు వచ్చినట్టు,
వేదనలో ఆలోచనల రాపిడి వల్ల ఆలోచనలు వస్తాయి.అలాంటి వేదన అవసరం,
ఒక చేదు అనుభవం గొప్ప పాఠం నేర్పిస్తుంది. 
అది నేర్చుకోవాలంటే, మనసు వేదనకులోనవ్వాలి.
ఆలోచనలతో బయటపడాలి.
అప్పుడే జీవితానికి అర్థం. వేదనలో ఆనందం వేతుకుంటూ వుంటే,జీవితం వ్యర్థం అవుతుంది.
ఎలా అంటే, కొవ్వొత్తు వెలుగును చూస్తూ, కొవ్వొత్తు కరిగిపోయినట్టు.
– బి రాధిక

Related Posts