వీడని‌ అనురాగం

వీడని‌ అనురాగం

 

పూవు తావిలా అల్లుకున్న అనురాగంలో…
చిగురించిన ఆశలన్నీ ఆశయాలైన క్షణంలో…
ఒకరికొకరంటూ మెసలుకునే సంసారంలో….
విడలేని స్మృతుల దొంతరలెన్నో…..

కళకళలాడే కాపురాన నవ వసంత గానమై…
కోయిల కుహు కుహు రాగమై అల్లుకుంటుంటే…
నిత్యం నవ వసంతాలు విరబూయిస్తుంటే‌‌….
నిను వీడి నేను మనలేని తపనల తలపువు నీవైనావు….

పరిచయమే ప్రేమగా మారిన ఆనాటి రోజులు…
ఆ ప్రేమలే పరిణయమై నిండిన ఆనందాలు…
సరికొత్త ఉషోదయాలు నింపుకున్న క్షణాలు…
మరపుకి రాని మధురోహల క్షణాలు…

చెలిమిగా మసలుతూ అడుగడుగునా తోడుంటూ…
కష్టనష్టాల తూకంలో సరిజోడుగా నీవుంటూ…
చేయందించి చేయూతనిస్తన్న తరుణంలో…
ఏం కావాలి ఏ మగువకైనా జన్మజన్మల బంధం నీ తోడుగా కాక….
ఎన్నో జన్మల అనుబంధం తొడుగా కోరుకోవడం తప్ప…
వీడని అనురాగం సొంతం చేసుకోవడం తప్ప….

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts