వీడుకోలు

వీడుకోలు

ఎలుగెత్తిన గళమై నీవు
ఎరుపెక్కిన తేజము నీవు
వెలుగంతా నీ దారంతా
ధన్యులమే ఇక మేమంతా
నిదురించే జగతిని నీవు
మెలమెల్లగ లేపుతావు
వేకువ జాడను తెస్తావు 
వెచ్చని కిరణం నింపేవు
పయనించే తేజము నీవై
వార్తాహరుడిగ నీవు
లోకాన్నే చుట్టేస్తావు
కోపాన్నే చూపిస్తావు 
సంధ్యాక్రాంతులతోటి 
సత్యాలను గ్రోలావేమో
ముసిముసినవ్వులతోడ
పడమటకై సాగుతావు
– సి.యస్.రాంబాబు

Related Posts