వేలు విలువ!!

వేలు విలువ!!

నీ వేలు స్పర్శ కి
మైమరచి
మైళ్లు నడిచా….!
దాన్ని బూని
నా దారి మరిచా……!
నిన్ను అనుసరించా….!

బుడి బుడి నడకలు
కావు నావి.
బుసకొట్టే వయసు నాది.
బుజ్జగిస్తే బోల్తా పడను.
అలలు తడిపిన ఇసుకలో
నీ పాదముద్రలాయెను
నా గుండెలో ప్రేమ ముద్రలు.

నా నడక గుడ్డి దాయె …..!
నా కన్నులు నీతో నిండి పాయె.
పూరెక్క లాంటి నీ చేరెక్క
నాకు ఇచ్చె స్థానం నీ పక్క……!

పూదోట లాంటిది నీ మనసు,
నాకు తెలుసు నీ గమ్యం అదే…..!

నీ వేలు స్పర్శకి
మైమరిచి
మైళ్లు నడిచా……………..!
దాన్ని బూని
నా దారి మరిచా……..!
నా పయనం ఇక
నీతోనే……………!

– వాసు

Related Posts