వెలుగు గీతం

వెలుగు గీతం

నారింజ రంగు ఆకాశం
నారాయణ మంత్రం జపిస్తున్నట్టుంది
చీకటి స్వప్నాలను తరిమేద్దామని
వెలుగు గీతాన్ని లిఖించేందుకు

ఆకాశం శూన్యం అనంతమని
పేర్లు తగిలిస్తాం
ఆకాశం వేర్లు మాత్రం
మనిషి మనసులో దాగుంటాయేమో

ఉదయాస్తమయాలలో రంగులద్దుకుని హంగులను తగిలించుకున్నా
తన తీరని ఆరాటం తెలియని తీరం వెతుకుతుంటుందేమో

కుతకుతలాడే జనజీవనం
విలవిలలాడే నిసర్గసంపద
విషాదమోహనాన్నద్దుతుంటే
బావురుమంటున్న భూమిని
జాలిగా చూసే ఆకాశం మాత్రం ‘జాలీ’ గా ఉంటుందెప్పుడు

– సి. యస్. రాంబాబు

Related Posts