వెలుగు రేఖలు

వెలుగు రేఖలు

వెలుగు రేఖలు
ఎందుకో తెలియని ఆవేదన
మనసును మబ్బు తెరలు కమ్మేస్తుంటే…
అంతరంగంలోని ఆలోచనలు
అగాధమంత అనిపిస్తుంటే
బతుకు భారంగా….
నడుస్తున్న నా బతుకు బాటలో
అడుగులు తడబడుతుంటే
ఆసరా లేని నా వంటరి జీవితం
రేపటి ఆశతో సాగుతున్న
నూతన జీవితం కోసం….
తడపడుతున్న నా అడుగులు
రేపటి సూర్యోదయ వెలుగుకై
తూర్పున సాగుతున్న నా ప్రయాణం….
సూర్యోదపు వెలుగు రేఖలు
జగతికి ప్రభాత వెలుగులు
కావాలి నా భావి జీవితానికి వెలుగు రేఖలు….

– అంకుష్

Related Posts