వెండి వెన్నెల
అమావాస్య నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం అయితే
పౌర్ణమి నుండి అమావాస్య
వరకు కృష్ణపక్షం అంటారు.
ఒక్కో పక్షం పదిహేనురోజులే.
పౌర్ణమి నాటి చంద్రుడు వెండి
వెన్నెలను విరజిమ్ముతాడు.
అమావాస్య రోజు చంద్రుడు
కనపడకుండా దాక్కుంటాడు.
మహరాజైనా సరే సమయం కలిసిరాకపోతే దాక్కోవాలి.
చంద్రుడి కధ మనకు ఇదే
విషయమే కదా చెబుతోంది.
వెండి వెలుగులు ప్రసరించే
చంద్రుడు చీకట్లో కలిసాడు.
చీకట్లో ఉన్న చంద్రుడు వెండి
వెన్నెలను కురిపిస్తాడు.
అదే కాల మహిమ.
దాన్ని ఎవరూ తప్పించలేరు.
-వెంకట భానుప్రసాద్ చలసాని