వెన్నెల దారి

వెన్నెల దారి

భూగర్భం తవ్వి చూసా మరి..!
నీటిలో ఈది వేతికా మరి..!
ఎలా చేరేది నా వెన్నెల దారి..??

నిశి లో దాగుడుమూతలాడెను మరి..!
ఆకాశానికి నిచ్చెనేసి వెతికా మరి..!
ఇక్కడ దాగుంది నా వెన్నెల మరి..??

తనే అన్వేషణకు తోడ్పడినది మరి..!
చుక్కల నడుమ చక్కని సుందరి మరి..!
వెలుగులు నింపి చూపెను
వెన్నెల దారి ..!!

– అక్షిత

Related Posts