వెన్నెల రాత్రి

వెన్నెల రాత్రి

వెన్నెల రాత్రి

 

భగ భగ మండే సూర్యుడు

ఇచ్చే వెలుగు రేఖలను

చల్లని వెన్నెల జల్లుగా

మారుస్తాడెలా చంద్రుడు?

కష్టాల కొలిమిలో

భగ్గుమంటున్న జీవితం

కూడా ఓ సూర్యని వలె కాదా?

అది పుట్టించే ప్రచండ కాంతులను

వేడి సెగలను తట్టుకుని

నిలబడే చంద్రులు..

నిండు పున్నమి నాడు

జాబిలి చిలికే

వెన్నెల రాత్రులుగా మలచగలరు!!

– సుస్మిత

Previous post వెలిగే రంగు
Next post ‘అ’ నుబంధం లో ‘ఆ’ నందం

One thought on “వెన్నెల రాత్రి

  1. బిన్నమైన ఆలోచన,అందమైన ఆలోచన
    చాలా బాగుంది,👌😍🙌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *