వెన్నెల తో మాట

వెన్నెల తో మాట

గువ్వనే నేను
గూటి లో దాగి
నింగి లో వెన్నెల తో
మాట కలిపాను
సైభీరియా లో స్నేహితుల
మంచి మంచు ముంచు సుఖమేనా అని
ఎడారి లో ఇసుక ను అడిగావా
చందమామ చల్లని వెన్నెల
చిన్న పాపలకు చిరు నవ్వు నిచ్చిందా అని
అమెజాన్ అడవుల్ని కదల్చి
తట్టి మరీ అడిగావా
తల్లి దరిత్రి కి స్వచ్ఛమైన
శ్వాస నీలా మెల్లగా మెల్లగా
వెదజల్లావ అని….

నేనే…. వెన్నెల్లో
గూటి గువ్వను
చీకట్లో నే …కాని
నా కంటి చూపుకాంతి
వెన్నెల్లో విశ్వ శాంతిని చూసింది

మరి పగలే వెన్నెల వెలుగు అయితే
విశ్వ కాంతిని కంటి చూపుగాచేసి
ఓ వన్నెల వెన్నెలా…
నీలో నేనై విహారిస్తా

– అల్లావుద్దీన్

Related Posts