వెన్నెలతో నా అనుభవాలు

వెన్నెలతో నా అనుభవాలు

వెన్నెలతో నా అనుభవాలు

 

వెన్నెల్లో హాయి హాయ్ , మల్లెల్లో హాయ్ హాయ్ అనే పిలుపులు. వెన్నెలవే, వెన్నెలవే మిన్నే దాటి వస్తావా ..అంటూ తీయని పలుకులు, వెన్నెలా ..వెన్నెలా మెల్లగా రావే అని జోల పాటలు , వెన్నెలైనా చీకటైనా, చెరువైనా దూరమైనా అంటూ ప్రేమ ముద్దు మాటలు. వెన్నెల్లో గోదారి అందం అంటూ గంభిరమైన మాటలు. ఇలా వెన్నెల పాటలు వింటూ వెన్నెలను చూడాలని అనిపిస్తుంది. కాని అదేo చిత్రమో ఎప్పుడూ వెన్నెల్లో కూర్చునే అలా ఫిల్ అయ్యే అవకాశం నాకు ఇంత వరకు రాలేదు.

కనీసం ఆ అనుభూతి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకు అంతగా మీరేం చేస్తారు జీవితం లో ఒక్కసారి అయినా అలాంటి  అనుభూతిని పొందాలి అంటారా, హ ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ చల్లని చందమామను చూసినా జ్గ్యాపకం , ఇప్పుడు మాత్రం ఎన్నేళ్ళు అయ్యిందో నిండు చందమామను చూసి, ఎప్పుడైతే పెళ్లి అయ్యిందో ఇక అప్పటి నుండి మొదలు, ఇల్లు సంసారం , బాధ్యతలు, పెళ్ళిళ్ళు,పేరంటాలు, వండడం, పెట్టడం ,కడగడం, పూజలు, వ్రతాలు, పురుళ్ళు , సేవలు, బారసాలలు ఇలా ఎన్నో ఎన్నెన్నో..

ఆ మీరు మరి చెప్తారు.. కనీసం పెళ్లి రోజో,  పుట్టిన రోజో అలాంటి అనుభూతిని పొందకుండా ఉన్నారా, అంటూన్నారా పెళ్ళిరోజులు, పుట్టిన రోజులన్నీ మర్చిపోయి, ఎన్నాళ్ళో గడిచింది.ఎంత సేపు మా వాళ్ళు వస్తారు అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ ఆర్డర్ లు వినడమే తప్ప ఇదోగో ఏమోయ్ ఈ రోజు నీ పుట్టిన రోజు అలా షికారుకు వెళ్దాం అనే మాటలు లేవు, ఏ సరదా లేవు, పిల్లలు,చదువులు,ర్యాంకులు, జీతం, బడ్జెట్టు , లెక్కలు, ఖాతాలు, ఖర్చులు, ర్యాంకు లు తక్కువ రావడానికి కారణాలు, బారసాలల ఖర్చులు చూపించడం తోనే సరిపోయింది…

ఇదిగో ఇప్పుడు అన్ని బాధ్యతలు తీరినా , అందరు సెటిల్ అయ్యాక కూడా అమ్మ నీ చేతి వంట చాలా బాగుంటుంది. అంటూ నేలకోక్కళ్ళు  పంచుకుని సేవలు చేయించుకుంటూ ఆ వెన్నెలను ఆ వెన్నెల పాటలను వినే అవకశం లేకుండా చేస్తున్నారు. ఒకే ఒక్క చిన్ని కోరిక విచ్చుకున్న వెన్నెల పొద్దులో సముద్రపు అలలను చూస్తూ, ఆ అలల తాకిడిలో పాదాలను ఆడిస్తూ , వెన్నెల పాటలు వింటూ , ఒంటరిగా గడపాలని, ఈ జన్మకు ఆ భాగ్యం కలుగుతుందో , లేదో  ?

అమ్మా అయ్యిందా… ఆ వచ్చే వచ్చే అయ్యో పెసరట్టు మాడిందే, ఎలా ఏమంటుందో ఏమో ఖర్మ …  వెన్నెల లేదు, పాటలు లేవు, మాడిన పెసరట్టు తప్ప….

అరుంధతి

Previous post ఏమని చెప్పను
స్నేహం Next post స్నేహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *