వెతుకులాట

వెతుకులాట

అసంతృప్త ద్రావణంలా
మనసు మరుగుతోంది
ఖైదు చేసినట్టు ఆలోచనలు
మేకులు కొట్టేసినట్టు మౌనం వహించిన మాటతో
నిరాశల నిషాలో నేనిప్పుడు

కనుచూపులో ఆశేలేక
కంటి చూపు మందగించింది
అడుగేసే పాదం
అడుసులో చిక్కినట్లు
చుట్టూ దిగ్బంధం
విడిపించి నడిపించే అక్షరం
ఎటుపోయిందా అని
వెతుకుతున్నాను

– సి. యస్. రాంబాబు

Related Posts