విచ్చలవిడి తనము?
ఆధునిక యుగంలో యువత ఇచ్చుకునే అర్ధం స్వేచ్ఛ కు విచ్చల విడితనం కదూ.
పెద్దవాళ్ళెవరైనా అలా కాదు ఇలా అంటే మా స్వేచ్ఛని హరించేస్తున్నారు. మమ్మల్ని హాయిగా బ్రతకనివ్వటం లేదని ఇంత గొంతు పెట్టుకుని అరుస్తారు.
పద్ధతిగా ఉండటం, మాట్లాడటం వస్త్రధారణ మన సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ధరించటం, పెద్దలతో మాట్లాడేటప్పుడు వినయవిధేయతలతో ఉండటం, రోడ్లు మీద బైక్ లు తోలేటప్పుడు, నిబంధనల్ని పాటించమనటం, టైమ్ కి ఇంటికి రమ్మని చెప్పటం లాంటి మంచి విషయాలు చెబితే, అబ్బా ఆపుతావా? అంటూ గావు కేకలు పెడతారు ఇప్పటి తరం.
ఇదంతా వాళ్ళ స్వేచ్ఛ ను హరించినట్లా? మీరు కూడా ఆలోచించండి.
తల్లులు కొనివ్వకపోతే వీళ్లు ఆ పొట్టి దుస్తులు ఎలా వేసుకోగలరు? వీళ్ళ వెనకాల మహిళా సంఘాలు వెనకేసుకురావటం. ఏమిటో ఈ వింత పోకడలు. మగపిల్లలైతే క్లబ్ లు, పబ్ లు ఏది మంచి, ఏది పిల్లల్ని చెడు త్రోవలు పట్టిస్తోంది అనేది తల్లిదండ్రులు,పెద్దలు ఆలోచించాలి.
స్వేచ్ఛ అంటే నలుగురు మెచ్చేటట్లు ఎవరినీ బాధపెట్టకుండా ఎవరి బ్రతుకు వారు బ్రతకటం అని అర్ధం చేసుకుంటే సమాజం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది.
అత్యాచారాలు, మాన భంగాలు కొంత తగ్గి ఆడపిల్లలు స్వేచ్ఛగా బ్రతకగలుగుతారు.
– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి