విచ్చుకున్న ఊహలు

విచ్చుకున్న ఊహలు

ఊహల్లో మనమే మరో లోకాన్ని సృష్టించి వుంటే
వ్యయ ప్రయాలతో పనిలేకుండా
అమ్మ పెట్టే వెన్న అయినా
అద్భుతమైన అందాలైన
చెడి పోని స్నేహం అయినా
వెన్నెల రాత్రులు అయినా
విరితోటలో పువులైన
శిల్పి చెక్కిన శిల్పం అయినా
విహరించే విహాంగాలైన
దేదీప్య కాంతులైన
నక్షత్రాల నవ్వులైనా
అందని ఆకాశం అయినా
వూహించని వుప్పెన అయినా
నడిసంద్రపు బాటలు అయినా
విధి కి అందని వింతలైన
పులకరించే సరిగమలైన
పుడమి తల్లి రోదన అయినా
నిన్ను వరించే అదృష్టమైన
అన్నీ విరబూసిన తీయనైన ఊహా లోకమే.
– జి.జయ

Related Posts