వీడియో
నేటి ప్రపంచంలో ఫోన్ అందులోని అవకాశాలకు యువత చాలా దగ్గరైపోయింది. నిత్యం మనం ఇక్కడ చూసిన ఫోన్ లో మాట్లాడేవారు కనిపిస్తుంటారు. అయితే ఈ మధ్య యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో వారి ఇంటి పనులు, సరదాలు, సంబరాలు, డ్యాన్స్ లు, బంధువులు సంబంధించిన వీడియోలు చేస్తున్నాం.
అయితే ఇందులో మంచి అవగాహన కల్గించేవి కొన్ని ఉంటే మరికొన్ని అనర్థాలును కలిగిస్తున్నాయి. అయితే నేటి యువత మన ఇంటిలో చెత్తాను ఎలా శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా మన సొంత ఊరును కూడా అదే విధంగా అభివృద్ది చేయాకునే విధంగా యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుంటుంది.
ఇటివల కర్ణాటకలోని హుబ్బళ్లి జిల్లాలో పరసపుర్ గ్రామం సరైన రోడ్లు లేక నానా బాధలు పడుతుండేవారు. అయితే గ్రామస్తుల బాధలను చూసిన గ్రామానికి చెందిన జగదీశ్ మూకీ ఓ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. అందులో గ్రామంలోని సమస్యల్ని చూపిస్తుండేవాడు.
అయితే వీడియోలకు మంచి స్పందన రావడంతో సబ్ స్రైబర్ల సంఖ్యా పెరగడంతో మంచి ఆదాయం సంపాదించాడు. ఆ డబ్బును గ్రామ ప్రజల కోసమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలో రోడ్లు వేయించాడు. అంబులెన్స్ ను కొనుగోలు చేసి గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తున్నాడు.
ఇలా ప్రతి ఒక్రు జగదీశ్ మూకీ చూసి వారి ప్రాంతాల్లో సమస్యలను తెలియజేస్తే ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుంది. అలాగే గ్రామాలు అభివృద్ది చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని నా భావన..
– మంజుల