విధి

విధి

విధి

సంక్రాంతి సెలవులకు సుకన్య హాస్టల్ నుండి ఇంటికి వచ్చింది. ఒకరోజు తన స్నేహితులతో కలిసి చెరువు గట్టు చూడడానికి వెళ్తుంది… తిరిగి వచ్చేటప్పటికి అమ్మమ్మ విచారంగా పెరట్లో కూర్చొనుంటుంది. అమ్మ వంటింట్లో వంట చేస్తూ వుంటుంది. “ఏమిటి గలగల మాట్లాడే అమ్మమ్మ ఈరోజు ఇంత విచారంగా వుంది అనుకుంటూ, ఏమే ముసలి మీ ఆయన గుర్తొచ్చాడా? అలా ఉన్నావు” అని అంటుంది ముందు నీకు పెళ్లి చేయాలి సుకన్య అంటూ వంటింట్లో నుంచి అమ్మ పకోడీలు తీసుకొచ్చింది.

వాటిని తింటూ అమ్మమ్మా కరోనా సమయంలో మన పక్కింటి కానిస్టేబుల్ సుబ్బయ్య వారి కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. పాపం ఆ పసిబిడ్డలు ఎలా ఉన్నారో అంటుంది. అవును! ఆ పిల్లలు ఎక్కడున్నారు అమ్మమ్మా. అసలు ఆ కానిస్టేబుల్ నర్సాపురం స్టేషన్లో పనిచేసేటపుడు ఒక్కరోజు కూడా డ్యూటీ కి సెలవు వేసేవాడు కాదు, ఎవరికి ఏ హానీ చేసేవాడు కాదు.

సుబ్బయ్య భార్యది మా ఊరు పక్కనే సీతాపురం అలా ఆయనతో పరిచయం అయింది, మీ నాన్నకు మంచి స్నేహితుడు. మీ నాన్న ఉన్నపుడు ప్రతి ఆదివారం కాఫీ తాగడానికి ఇంటికి వచ్చేవారు. అతనికి కోవిడ్ కేర్ సెంటర్లో నిర్వహణా భాద్యతలు అప్పగించినపుడు చాలా మందికి పడకలు, ఆక్సిజన్ సిలిండర్ల సౌకర్యాలను కల్పించడంలో తనవంతు కృషి చేశాడు.

కానీ విధి ఆడిన నాటకంలో అతనికే కరోనా మహమ్మారి సోకడం, అనుకోకుండా అతని భార్యకు సోకడం వల్ల ఇటు పిల్లలు, వారు విధి వంచితులయ్యారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే హాస్పిటల్ లో ఉన్నా ఒకరినొకరు కలుసుకోలేకపోవడం అతను వెంటిలేటర్ పై ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని పోరాడుతున్నడు ఆ సమయంలో పిల్లలను చేరదీయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

మీ అమ్మే ఆ పిల్లలకు కరోనా పరీక్షలు చేయించి నెగెటివ్ రావడంతో మన ఇంట్లోనే పెట్టుకుంది. తర్వాత కొద్దిరోజులకు సుబ్బయ్య మరణించడంతో అదే హాస్పిటల్ లో ఉన్న భార్య భర్తను ముట్టుకోవడానికి వీలు లేనందున తల్లడిల్లి పోతుంది. పిల్లలు తండ్రి ఆఖరి చూపులను కూడా పొందని విధి వంచితులయ్యారు…

********

కొద్ది రోజులకి వాళ్ళ అమ్మ కరోనా నుండి కోలుకున్న తర్వాత తన పిల్లలని తీసుకొని వెళ్ళింది. పాపం ఆవిడ పిల్లలను ఎలా పెంచుతుందో…! పెద్దదిక్కు లేని ఈ ఇంటిని మీ అమ్మ చాలా కష్టపడి ఈ స్థాయికి తెచ్చింది. మీ నాన్నే ఉంటే మీ అమ్మకు ఇన్ని కష్టాలుండేవా? బహుష విధి వంచితులు అంటే ఇదేనేమో అనుకుంటూ అమ్మమ్మ కన్నీరు మున్నీరవుతుండగా ఆ కానిస్టేబుల్ భార్య తన పిల్లలతో కలసి మమ్మల్ని పలకరించడానికి మా ఇంటికి వచ్చారు.

– హనుమంత

అసూయా ద్వేషాలు Previous post అసూయా ద్వేషాలు
విధి వంచితులు Next post విధి వంచితులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *