విజయంపై పట్టు

విజయంపై పట్టు

ఆరంభం అదిరింది
ప్రత్యర్ధుల కల చెదిరింది
పది వసంతాల తీరు మారింది
కప్పు పై మాకు ఆశ పెరిగింది
హ్యాంగింగ్ గార్డెన్ పేరు మార్మొగింది
అంతిమ విజయం మీ ముందుంది.

అద్భుతం మీ విజయం
కొంతమందికి అది మాయని గాయం
చూసిన వారందరికీ కమనీయం
బహుశా ఇపుడక్కడ అంతా మీ నామస్మరణీయం.

మీ గెలుపు నిజం
కడవరకు ఆడటం మీ ఇజం
ఆపై గెలుపోటములు సహజం

ఇదే మీరు పాటిస్తున్న సహజ సూత్రం..

మరెన్నో విజయాలు మీరు సాధించాలని, వాటికి మేము సాక్షులుగా ఉండాలని మనసా వాచా కర్మేణా కోరుకుంటూ మరోసారి విజయోత్సవ శుభాకాంక్షలు.

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts