విలువైన ప్రేమ
నాదొక చిన్న కుటుంబం ఇంట్లో అయిదుగురు అమ్మ,నాన్న,నేను, ఇద్దరు తమ్ముళ్ళు , హాయిగా ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితం లో ఒక్కసారి గా కుదుపు. నాన్న మరణం. చిన్నవాళ్లు తమ్ముళ్లు ,ఎం చేయాలో తోచలేదు.ఇంటికి తెచ్చాం.బంధువు లు వచ్చారు .జరిగేదంతా జరిపించారు.
కానీ ఇన్నాళ్లు మాకు ఎంతో ప్రేమను పంచిన నాన్న అలా హఠాత్తుగా మరణించడం , ఆయన బ్రతికి ఉన్నప్పుడు మాతో గడిపిన క్షణాలు ఎంతో అమూల్యమైనవి.
అంతా ఏడుస్తుంటే నేను మాత్రం ఎడవకుండ అలాగే నిల్చున్న నాన్నని చూస్తూ, ఇన్నాళ్లు మా బాధ్యతలతో సతమతం అవుతూ, ఎన్నో రకాలుగా మాకు అడిగిండల్లా కొనిస్తూ , మమల్ని ఏ లోటూ రాకుండా చూసుకున్న నాన్న ఇప్పుడు ప్రశాంతంగా బాధ్యతలు ,హడావుడి లేకుండా ప్రశాంతంగా నిదురపోతున్నట్టు ఉన్నారు. ఆ బాధ్యతలు అన్ని నీకే అని చెప్తున్నట్టు అనిపిస్తుంది.
అమ్మ,తమ్ముళ్లు నాన్నని తీసుకుని వెళ్తుంటే ఏడుస్తున్నారు. కానీ నాకేంటి మళ్లీ నాన్న తిరిగి వస్తారు అనిపిస్తుంది. ఏమో నన్ను ఎవరో పట్టుకున్నారు. నడవలేక ,నిలబడలేక, సోలిపోతున్నా, నన్ను పట్టుకున్నది ఎవరో కూడా తెలియదు.
అందరం నాన్న చివరి చూపు చూస్తూ ,తిరుగుతూ ఉంటే నాన్న నిద్రలో ఉన్నారు .వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అని అనిపించింది.కానీ అలా తిరుగుతూ ఉంటే నాన్న కళ్ళు తెరిచి నన్ను చూస్తూ నవ్వుతున్నట్టు అనిపించింది . కానీ నేను ఎవరికీ చెప్పలేదు.
తమ్ముడు చివరి చూపు చూసి నిప్పు పెట్టారు.అయినా నాలో స్పందనలేదు. ఎందుకంటే నాన్న నా పక్కనే ఉన్నారు. నాలోనే,నాతోనే ఉన్నారు అనే భావం నాకు స్పందన కలిగించలేదు. అంతకు ముందు రోజు పిలిచి అమ్మా నేను ఉన్నా, లేకున్నా, అమ్మని ,తమ్ముళ్ళని, జాగ్రత్తగా చూసుకోవాలి అనే మాటలే చెవుల్లో మారు మ్రోగుతున్నాయి.
ఆ మాటలు గుర్తు చేసుకోగానే అప్పుడు, అప్పుడు, గుండెలు అవిసెలా ఏడ్చాను. అయ్యో నాన్న మీరన్న మాటలు ఇందుకా ,బాధ్యతల్ని నాకు అప్పగించారా, నాన్న విలువైన మీ ప్రేమను నేను నా తమ్ముళ్లకు,అమ్మకు అందించగల శక్తి నాకు ఉందా ? మీరు చేసినట్లు అన్ని సక్రమంగా చేయగలనా నాన్న ఎంత పెద్ద బాధ్యత పెట్టావు.
నువ్వు లేని ఈ జీవితం ఎందుకు నాన్న , అమ్మా అని పిలిస్తే ఎవరైనా పలుకుతారు. కానీ నాన్న అని ఎవర్ని పిలవలేము నాన్న నాన్న నాన్న …. గొంతు చించుకుని అరుస్తూ ఉంటే అదిగో ఫోటో లో నుండి ఎలా నవ్వుతున్నారు. నాన్న నీ ప్రేమను పరిపూర్ణంగా పొందలేకపోయాము.అయినా నాన్న నువ్విచ్చిన ధైర్యం తో ముందుకు సాగుతున్నా నాన్న..నాన్న నాన్న…
– భవ్య చారు