విమానం సినిమా సమీక్ష

విమానం సినిమా సమీక్ష

విమానం సినిమా సమీక్ష

చాలా మామూలు కథ. కానీ కొత్తగా అన్ని రకాల ఉద్వేగాల తో తీసిన సినిమా.

వీరయ్య, రాజు, డేనియల్, కోటి, సావిత్రి ఈ అయిదు పాత్రలతో సినిమాను నడిపించారు. అందరి నటన చాలా బాగుంది.

ఇక కథ ఏంటి ?

దాదాపు అందరూ సినిమా చూసే ఉంటారు కాబట్టి నేను కూడా నా అభిప్రాయాన్ని చెప్తున్నా…

వీరయ్య భార్య బిడ్డను కని చనిపోతుంది. అప్పటి నుండే వీరయ్య కొడుకు రాజును కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు.

వీరయ్య సులభ్ కాంప్లెక్స్ లో పనిచేస్తాడు. అతను వికలాంగుడు. కానీ పెన్షన్ మాత్రం తీసుకోడు. ఎందుకు అంటే నాకు ఒక్క కాలు అయినా ఉంది.

రెండూ కాళ్ళు లేనివారికి ఉపయోగం కదా అని చెప్తాడు. తనకు లేకపోయినా ఎదుటి వారికి సాయం చేసే వ్యక్తిత్వం వీరయ్య ది.

ఇక రాజు వీరయ్య కొడుకు కు విమానం అంటే చాలా ఇష్టం. ఒక్కసారి అయిన విమానం ఎక్కాలని ఆశ, విమానం వెళ్తుంటే, బై చెప్తూ చాలా దూరం వెళ్తాడు. పడబోతున్న రాజుని తండ్రి పట్టుకుని పడిపోతావ్ నాన్న అంటే, నువ్వు ఉన్నావు కదా నాన్న పట్టుకోవడానికి, అంటూ తండ్రి డబ్బులు ఇచ్చి చాక్లెట్స్ కొనుక్కో, అంటే దానితో విమానం బొమ్మ కొని తెస్తాడు. పెద్దయ్యాక విమానం పైలెట్ కావాలని కలలు కంటుంటాడు.

ఒక చిన్న కాలనీ లో తన గుడిసెలో పిల్లాడితో చక్రాల కుర్చీలో ఉంటూ పిల్లాడిని కష్టపడి చదివిస్తూ ఉంటాడు. అదే కాలనీలో కోటి , డేనియల్ లు ఉంటారు. డేనియల్ ఆటో నడిపితే ,కోటి చెప్పులు కుడుతూ ఉంటాడు. ఇక సావిత్రి వెయ్యి రూపాయలు ఇస్తే చాలు అంటూ వ్యాపారం చేస్తూ ఉంటుంది. కోటి ఆమెని ఆరాధిస్తూ ఉంటాడు.

ఇలా సాగిపోతున్న సమయం లో కోరుకొండ సైనిక పాఠశాల లో రాజు కి సీటు వస్తుంది. ఆ సమయం లో వీరయ్య అందరికీ స్వీట్ తేస్తుంటారు. సడెన్ గా రాజు కింద పడడo తో, రాజుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అప్పుడే ఒక విషాద వార్త తెలుస్తుంది వీరయ్యకు… 

రాజు కు లుకేమియా క్యాన్సర్ అని ,నెలరోజుల కన్నా ఎక్కువ బ్రతకడు. అని డాక్టర్ చెప్పడం తో అవ్వాక్కవుతాడు వీరయ్య. ముందే భార్య లేదు,ఇప్పుడు కేవలం కొడుకు కోసమే బ్రతుకుతున్న విరయ్యకు ఇది నమ్మలేని నిజం లా అవుతుంది. తన బాధ ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలి పోతూ, రాజు నీ స్కూల్ మానిపించి, ఇంట్లోనే ఉంచుతాడు.

కోటి, డేనియల్ జోకులు వేస్తూ ఉంటారు. కానీ వారికి వీరయ్య బాధ తెలియదు. వారికి వీరయ్య ఏమి చెప్పడు. ఒక రోజు వీరయ్య నడుపుతున్న సులభ్ కాంప్లెక్స్ నీ ప్రభుత్వం కూల్చివేస్తుంది.

దాంతో వీరయ్యకు ఉన్న ఆధారం కూడాపోతుంది. దాంతో పని కోసం చాలా వెతుకుతాడు. ఒక టింబర్ డిపోలో పని దొరుకుతుంది.

నాలుగు రోజులు అయ్యాక, వీరయ్య తన యజమానిని పదివేలు అడుగుతాడు. దానికి యజమాని కొప్పడి పంపిస్తాడు.

మరుసటి రోజు యాభై వేలు దొంగిలించాడు. అని అదే యజమాని వీరయ్యను కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు.

అతని దగ్గర పదివేలు తీసుకున్న ఎస్సై వీరయ్యని బాగా కొడతాడు. కానీ వీరయ్య నేను తీయలేదు అని అంటాడు.

మరుసటి రోజు అదే యజమాని వచ్చి డబ్బు పోలేదని, తన కొడుకే తీశాడు అని కేసు వాపస్ తీసుకుంట అంటే అయిదు వెలిచ్చి వెళ్ళు అంటాడు. తర్వాత ఎస్సై వీరయ్యను వదిలేస్తూ డబ్బులు ఇస్తే వీరయ్య తీసుకోడు.

అదే సమయం లో రాజు ను, డేనియల్ కొడుకును, ఆర్మీ వాళ్ళు పట్టుకుని వస్తారు.ఎందుకంటే వాళ్ళు ఎయిర్ పోర్ట్ లోకి దొంగతనంగా ప్రవేశించబోయారు.

అనే నేరం పై తీసుకు రావడం తో అక్కడ తండ్రిని చూసి రాజు వెళ్తాడు. ఎస్సై వీరయ్యను కొట్టబోతే కానిస్టేబుల్ అపేసి, కొడితే మన పై  sc,St case అవుతుంది అనడం తో ఎస్సై ఆగిపోతాడు.

ఇక ఇంటికి వెళ్ళాక డేనియల్ భార్య ,తన కొడుకుని, భర్తను తిడుతూ, నువ్వు ఆ రాజుతో స్నేహం చెయ్యకు, నువ్వు ఆ వీరయ్య తో స్నేహం చేయకు అని భర్తను తిడుతుంది. దాంతో

డేనియల్ భార్యను తిట్టి లోపలికి పంపి , వీరయ్య ఏమి అనుకోకు, అంటే అప్పుడు వీరయ్య తన కొడుకు కు క్యాన్సర్ అని నెల రోజుల్లో చనిపోతాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటే,

డేనియల్, కోటి షాక్ అవుతారు. ఇంతలో లోపలి నుండి రాజు వచ్చి రక్తం వస్తుంది అంటూ పడిపోతాడు.

దాంతో హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అప్పుడు వీరయ్య ఇంకా ఏన్ని రోజులు బతుకుతాడు అని డాక్టర్ ని అడిగితే, డేనియల్ ఏంటి  అలా అంటావు ఎంటి అంటే,

దానికి వీరయ్య ,వాడికి విమానం ఎక్కాలని చివరి కోరిక రా, దానికి పది వేలు కావాలి అంటూ చెప్తాడు. డేనియల్, కోటి పూటకు గతి లేనివాళ్ళు. వాళ్ళు మాత్రం ఏం చేయలేరు. అందుకే మౌనంగా ఉంటారు.

ఇక వీరయ్య పనికోసం జోకర్ వేషం కూడా వేస్తాడు. అలా వచ్చిన డబ్బుతో బాబు కి సిటీ అంతా చూపించాలని వెళ్తుంటే, ఒక కారు వచ్చి డాష్ ఇచ్చి,

అందులోని వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టి, వీరయ్య దగ్గర ఉన్న డబ్బులన్నీ  తీసుకుని వెళ్తారు. కారు డ్యామేజ్ చేశారు అని వెళ్లిపోతారు.

ఇక వీరయ్యకు దారి లేదు. కొడుకు ఎప్పుడూ చనిపోతాడో , తెలియక విలవిలలాడుతూ ఉంటాడు. అదే సమయంలో ప్రభుత్వం ఆ కాలనీ వారికి పట్టాలు ఇస్తూ ఉంటారు.

అప్పుడు వీరయ్య పట్టాలు ఇస్తే మన ఇల్లు అమ్మితే ఎంత వస్తాయి అని డేనియల్ నీ అడుగుతాడు.పది,ఇరవై లక్షలు అంటాడు.

మరి ఇప్పుడు అమ్మితే అంటాడు. దానికి డేనియల్  ఏమంటున్నావు, ఇల్లు అమ్మితే నువ్వు ఎక్కడుంటావు అని డేనియల్ అంటే, నేను ఎక్కడో ఉంటాను. అంటున్నప్పుడు పక్కన ఇల్లు అతను నేను కొంటాను అనడం తో,

పదివేలకు ఇల్లు అమ్మేసి ఎయిర్ పోర్టు లో తిరుపతి కి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేయడానికి వెళ్తాడు. కానీ అక్కడున్న ఆవిడ ఇంకా రెండు వేలు తక్కువ అయ్యాయి. అని చెప్పడం తో, తన వీల్చైర్ నీ అమ్మెస్తే వెయ్యి రూపాయలు వస్తాయి. ఇంకో వెయ్యి కోసం చాలా మంది నీ అడుగుతాడు.

అప్పుడే కోటి ఎన్నో రోజుల నుండి చెప్పులు కుట్టి డబ్బు దాచుకుని సావిత్రి దగ్గరకు వెళ్ళాలని వెళ్తుంటే, వీరయ్య డబ్బులు అడుగుతాడు.కోటి తన దగ్గరున్నా , లేవని అంటే ,

అవును , నీ దగ్గర ఎలా ఉంటాయి అని వీరయ్య వెళ్తాడు . ఇక కోటి  సావిత్రి దగ్గరకు వెళతాడు.

కానీ అక్కడికి వెళ్ళాక రియలైజ్ అయ్యి, సావిత్రి కి  ఇచ్చిన వెయ్యి రూపాయలు తీసుకుని వెళ్తుంటే సావిత్రి వెనక పడుతుంది.

కోటి వెళ్లి వీరయ్యకు డబ్బులు ఇస్తాడు. ఎక్కడివి అంటే సావిత్రి ఇచ్చింది, అని కోటి చెప్పడం తో, వీరయ్య ఆమె కాళ్ళు మొక్కబోతాడు. కానీ సావిత్రి వద్దని అంటుంది.

ఇక వీరయ్య టికెట్లు కొంటాడు. ఇక్కడ సావిత్రి కోటి నీ నా పెరెందుకు చెప్పావు అంటుంది. అప్పుడు నిజం చెప్తాడు కోటి, ఇక సావిత్రి నీ ప్రేమిస్తున్నా అని పెళ్లి చేసుకుంటాను అనడం తో వారిద్దరూ ఒకటి అవుతారు..

ఇక రాజు , వీరయ్య, డేనియల్, కోటి ఆటో లో ఏర్ పోర్ట్ కి వెళ్తారు. కోటి డేనియల్ రాజు, వీరయ్య ను లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన వారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక,

ఒక ఏర్ హోస్టెస్ నీ అడిగితే, నేను అందులోనే వెళ్తున్నా, అంటూ చెప్పి విల్ చైర్  పంపి వారిని విమానం ఎక్కిస్తుంది.

విమానం ఎక్కే ముందు రాజు విమానాన్ని. ముద్దు పెట్టుకుంటాడు.ఇక విమానం ఎక్కిన తర్వాత రాజు అన్ని చిన్నగా కనిపిస్తాయి అంటూ తండ్రికి చెప్తాడు.

అవును నాన్నా నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా అని వీరయ్య అడిగితే చాలా సంతోషంగా ఉందని అనడం తో దేవుడికి దణ్ణం పెట్టుకుని, రేయ్ రాజు విమానం ఎగరబోతుంది అంటూ చెప్తూ, తన వైపు చూసేసరికి రాజు చనిపోతాడు.

అది చూసి వీరయ్య చాలా బాధ పడతాడు. ఏడుస్తూ ఉంటే ఏయిర్ హోస్టెస్ వచ్చి ఏమైంది ?అని అడుగుతుంది. అప్పుడు రాజు చనిపోయాడు. అని చెప్తే ,ఆమె అoబులెన్స్ కి చెప్తా అంటుంటే,

వద్దమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా విమానం లో ఎగరాలని వాడి చివరి కోరిక. వాడి ఆత్మ కు శాంతి చేకూరాలని అనడంతో, సరే మీరు మేనేజ్ చేయండి అంటుంది. సరే అని చనిపోయిన రాజు తో ఏవేవో కబుర్లు చెప్తూ దు;ఖాన్ని దిగమింగుతూ ఉంటాడు.

చివరికి విమానం తిరుపతి లో ల్యాండ్ అవుతుంది.అందరూ దిగిన తర్వాత ఏర్ హోస్టెస్ వచ్చి ,సర్ నేను అధికారులకు చెప్పాను. మీరు ఎక్కడికి వెళ్ళాలో, చెప్తే దింపుతారు అంటుంది.

కానీ వీరయ్య లో చలనం ఉండదు. అనుమానం వచ్చిన ఆమె అతన్ని తాకుతుంది.కొడుకుతో పాటూ తండ్రి కూడా చనిపోవడం తో సినిమా ముగుస్తుంది….

ఇక్కడ వీరయ్య గా సముద్ర ఖని, కోటి గా రాహుల్ రామకృష్ణ, డేనియల్ గా ధనరాజ్, సావిత్రి గా అనసూయ లు బాగా నటించారు. సముద్రఖని లో గొప్ప నటుడు ఉన్నాడు అనేది మనకు తెలుసు.

ఇందులో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కొడుకు కోరిక తీర్చాలి అనే తపన తండ్రి అంటే ఇలాగే ఉండాలి అనే సందేశం తో చాలా బాగా తీశారు.

మైనస్ :- కొన్ని ఉద్వేగ భరిత సన్నివేశాల్లో వీరయ్య ఇంకా బాగా నటించాల్సిoది అని అనిపించింది. ఇంకా కొన్ని సన్నివేషాల్లో వీరయ్యకు అవమానం చేసిన వాళ్ళు మారాల్సింది అని అనిపించింది.

మొత్తానికి ఒక్క డైలాగ్ తో ఏడిపించారు. ” దేవుడు అన్ని ఇవ్వడు,కానీ నాన్న అన్ని ఇస్తాడు ,అనేది నాకు బాగా నచ్చింది. సూపర్ సినిమా నేనైతే ఏడ్చాను.

నా రేటింగ్ 10/9.5

 

-భవ్యచారు

తకరారు Previous post తకరారు
బుజ్జగింపు Next post బుజ్జగింపు

One thought on “విమానం సినిమా సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close