వినాయక పూజ ఇలా చేసుకుందామా?
“తాతా తాతా మనం గబగబా వెళ్లి వినాయకుడిని తెచ్చుకోవాలి .. మరి పత్రిక తెచ్చుకోవాలి… పూజ చేయాలి.. మా ఫ్రెండ్స్ అందరూ నిన్ననే తె చ్చేసుకున్నారు మంచి మంచి వినాయకుడులు తెచ్చుకున్నారు .. ఎంత కలర్ ఫుల్ గా ఉన్నాయో తెలుసా. మరి మనం ఎప్పుడు తెచ్చుకుంటాము.?”
“సరే నడు” అన్నాడు వెంకటేశం మనవడు గణేష్ తో… వెంకటేశం భార్య పద్మావతితో పండుగకు కొడుకు ఇంటికి వచ్చారు. ఇద్దరూ కలిపి బజారుకు వెళ్లేటప్పటి కల్లా రకరకాల రంగుల వినాయకుడులు రకరకాల భంగిమలలో , పరివారం తోఎంతో చక్కగా కనిపించారు.
“తాతా..ఇది ఎంత బాగుందో అన్నాడు”అన్నాడు గణేష్ ఆనందంగా ఒక వినాయకుడిని చూసి.
“అది కాదు” అంటూ అలాఅలా తిరిగి ఊరుకున్నాడు ఆయన
“అంతా చూసి ఏంటి ఏమీ కొనలేదు? మొత్తం అంతా చూడడం అయిపోయింది కదా” అని గణేష్ నిరాశగా అనేటప్పటికి “కన్నా అలా కాదు మనం వినూత్నంగా చేసుకుందాం . మీ వాళ్ళందరూ కూడా మన వినాయకుడిని చూసి ఆశ్చర్యపోవాలి .”
“ఎలా?”
“ఇంట్లో నేను చేస్తా…”
“నీకు వచ్చా… భలేభలే…అయితే సరే నడు..పత్రి కొనలేదు..”
“అందులో అసలు పూజ చేయవలసిన పత్రి ఒకటో రెండో ఉన్నాయి తప్పించి మిగిలినదంతా రకరకాల ఆకులు తీసుకొచ్చి పెట్టారు ..ఇది కాదు పత్రిఅంటే.నడు” అన్నాడు వెంకటేశం. ఇంటికి వెళ్లేటప్పటి కి,”ఏంటి ఏమీ తీసుకురాలేదు “అంది కోడలు సంధ్య భార్య పద్మావతి కొడుకు సారధి నవ్వుతూచూస్తున్నారు..
సంధ్యకి మామగారు ఏ పని చేసినా ఏదో వినూత్నంగా చేస్తారని తెలుసుగాని ఏం చేస్తారో అర్థం కావట్లేదు ఖాళీ చేతులతో వచ్చిన వాళ్ళిద్దర్నీ చూసేటప్పటికి… తమతో తెచ్చుకున్న బంకమట్టి తడిపి ఒకపెద్ద ఉండా రెండు చిన్న ఉండలు చేశాడు .. పెద్ద పెద్ద ఉండ పొట్టగా పెట్టాడు ఒక ఉండ ముఖం గా పెట్టాడు కింద ఉండ నడ్డి భాగముపెట్టాడు.
ఒక చెక్క దిమ్మ మీద పెట్టికాళ్ళు చేసి పెంచే గోరుతో దిద్దాడు. పఐఉండలఓ బొజ్జా బొడ్డూ దిద్ది చేతులుపెట్టి కుడిచేతిలో దంతంముక్కా…ఎడమచేతిలోఖాళీగా ఉంచి ,”ఇందులో లడ్డూ పెడదాము”అనగానే “ఓకే తాతా”అన్నాడు గణేష్ ఆనందంగా పైఉండలో గడ్డఘూ మూతి ముక్కూ కాళ్ళూ దిద్ది, జుట్టుకు డా దిద్దాడు.
తాను తెచ్చిననకిలీనగలు మెడలో వేసి పూలమాలలు వేసేటప్పటికి చాలా అందంగా అయ్యాడు గణపతి.. పట్టుపంచ ముక్క కట్టేడు.పైన కండువా ముక్క వేసాడు . ” మట్టి వినాయకుడు అయితే మాత్రమే ఈ గంగలో కలిస్తే మనకి ఏమి నష్టం చేయడు. మిగిలినవి రకరకాలవన్నీకరగడానికి గట్టి వినాయకుడుని కర్రలతోకొడతారు. ఇనపరాటడ్లతో కొడుతారు ..అదినీకు ఇష్టమా?”
” అవును తాత నిజమే ..నాకు ఏడుపువస్తుంది నిమజ్జనం రోజు.” ఇలా వేసుకుంటే పర్యావరణ పరిరక్షణ కూడా ఔతుంది. ” అని మరో బేగ్గు విస్తరించకుండా బౌల్స్ తీసాడు.. “మనదగ్గర ప్లాస్టిక్ బౌల్స్ ఉన్నాయి”
ప్లాస్టిక్ వాడి మనం మన చుట్టు పక్కల కంగాళీ చేయకూడదు. నీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఇంట్లో శనగలు బూందీ ఉండ్రాళ్ళు ప్రసాదాలన్నీ ఈ బౌల్స్ లో పెట్టి ఇవ్వాలి. ఈ రకంగా మనం ఈ భూమి రుణాన్ని తీర్చుకోవాలి .
ఈ భూమి మనకు ఎన్నో ఇచ్చింది. దాన్ని మనం సర్వనాశనం చేస్తున్నాం . మనకి దొరికిన ఈ ప్లాస్టిక్ తోటి చెత్తాచెదారాలతోటి పెద్ద పెద్ద వినాయకుడిని చేసి గొప్పలకి పోయి మనం మనకున్న నీటి వనరులనీ సర్వనాశనం చేసుకుంటున్నాం. ఇలా చేయకూడదు మనం ఈ పత్రాల్లో ప్రసాదాలు తినడం వల్ల ఈ ఆకులు తొందరగా ఎండిపోతాయి మట్టిలో కలిసిపోతాయి..”
” చాలా బాగా చెప్పావు తాతా”
“మరిపత్రాలు?”
పద్మావతితో”ఇవిగో “అంటూ తనతో తెచ్చిన పత్రాలు తీ సింది బయటకి..
” మనకి పెర్లుఎలా తెలుస్తాయి?”
“అవన్నీనేను చూపిస్తాను కదా”అని గరిక, తులసి, దానిమ్మ, మరువము, రావి, టేకు,జిల్లేడు,ఉమ్మెత్తామొదలైన పదిహేను ఆకులు చెప్పేడు..
” వినాయకుడికి 21 చాలా ఇష్టం అందుకని చెప్పేసి 21 ఇలాగ విరిచి గరిక ముక్కలు ఒక కట్ట నీకోటి నాకోటి అమ్మకి నాన్నకి మళ్ళీ మీ మామ్మ కి అందరికీ కట్టు కట్టినవి మనం అర్పిద్దాం .
“మిగిలిన పత్రి దొరక్కపోతే ఏమీ బాధలేదు…ఉన్నవి సక్రమంగా అర్పించితే చాలు.. “
“వినాయకుడి పూజ ఎప్పుడూ ఇలాగే చేసుకోవడం వల్ల పర్యావరణానికి నష్టం లేదు… మనకి కూడా డబ్బు దండగ లేదు” అన్నాడు గణేష్..
వెంటనే అందరూ ” బాగా చెప్పావు రా” అనేసి పూజ మొదలుపెట్టారు….
– సుబ్బలక్ష్మి