విరహాగ్ని
విరహాగ్ని బాధను కలిగిస్తుంది.
మనల్ని నిలువెల్లా బాధిస్తుంది.
అది మనసును దహిస్తుంది.
ప్రేమికులు దూరమైతే తపించే
గుండెలో విరహాన్ని ఆపలేము.
ప్రేమించే మనసును దూరం
చేసుకోవద్దు.
ప్రేమించే మనిషికి దూరం
కావద్దు.
విరహాగ్ని తట్టుకోలేక
అత్మహత్య చేసుకునేవారు ఎందరో.
విరహం భరించలేక పిచ్చివారిగా మారినవారు
ఎందరో.
-వెంకట భానుప్రసాద్ చలసాని