విరిగిన మనసు

విరిగిన మనసు

 

అమ్మా అమ్మా విరిజ కనిపించడం లేదు అంది సుప్రజ ఎంత వెతికినా కనిపించడం లేదు అంది తల్లి జలజ తో అయ్యో అయ్యో నేను అనుకుంటూనే ఉన్నాను ఇదేదో చేస్తుందని ఏమండోయి ఇది విన్నారా అంటూ బయట ఆఫీస్ లో ఉన్న లాయర్ గుర్నాధం దగ్గరకు వచ్చింది జలజ.

ఫోన్ లో ఏదో చూస్తున్న గుర్నాధం జలజ మాటలతో ఈ లోకం లోకి వచ్చి ఎంటే ఆ అరుపులు అన్నాడు నిదానంగా గత ఇరవై అయిదు ఏళ్లుగా భార్య మాటలకు గాబరా పడకూడదు అనే నిజం గ్రహించిన వాడై భార్య గాబరా పడకుండా నిదానంగావినడంమొదలుపెట్టాడు.

యెప్పుడూ మీరు మీ ఫోన్ అంతేనా ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకొనే అవసరం లేదా , అంది ఫోన్ తీసి పక్కన పెడుతూ నా సంగతి వదిలెయ్యి కానీ ఏం జరిగిందోచెప్పుఅన్నాడుగుర్నాధం.

మీ గారాల పట్టి కనిపించడం లేదు చూసారా అంది అవును విన్నాను ఇప్పుడేం చేయాలిచెప్పుఅన్నాడుఅంతేనిదానంగా..

ఏంటండీ ఏం చేయాలి అని అడుగుతారు వెళ్లి వెతకండి అంది. వెతకడం అవసరం లేదు నేను నా తెలివి తేటలతో కొడతా కదా అన్నాడు గుర్నాధం

ఏం తెలివి తేటలో ఏమో ముందు వెతకండి అవతల పెళ్లి అయితే చాలా కష్టం అందిజలజ.

ఇంతకీ వాళ్ళ వివరాలు ఏంటో చెప్పు అనగానే సుప్రజ వైపు చూసింది తల్లి ,

సుప్రజ ఒక పేపర్ తీసి పేరు శేఖర్ , తండ్రి టీచర్ ,తల్లి గృహిణి, ఇద్దరు అమ్మాయిలు, శేఖర్ బ్యాంక్ లో అకొంటెంట్ గా పని చేస్తున్నాడు .

అంటూ గడగడ చెప్పేసరికి ఆ కాగితం లాక్కుని గుర్నాధం చెప్పులు వేసుకుని బయటపడ్డాడు.

వెళ్తున్న అతన్ని చూస్తూ భర్త మీద నమ్మకం తో పద వే నాన్నగారు అక్కను తీసుకునివస్తారుఅందిసుప్రజతో..

******

చూడండి  మాకు ఇద్దరు అమ్మాయిలు ఇది ఇలా వచ్చేస్తే నా ఇంకొక కూతురికి పెళ్లి అవడం కష్టం పైగా అదింకా మైనర్ కాబట్టి నేను కోర్టులో కేస వేస్తాను. మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి కాస్త ఆలోచించండి కోర్టు కేసు అంటే మీకు తిరగడంతప్పదు.

అయినా కొడుకు కోసం తిరుగుతాము అంటే నాకేం నష్టం లేదు. మీ కూతుర్లకు పెళ్ళిళ్ళు కావాలి అంటే కుటుంబం ఎలా ఉందో అని తెలుసుకుంటారు. మరి దీని వల్లఏంజరుగుతుందిచెప్పాను.

ఇది బెదిరింపు కాదు మీ కులం లో చేసుకుంటే మర్యాద, గౌరవం, తో పాటు కట్నం కూడా వస్తుంది. కాదు అంటే తిరగాల్సి వస్తుంది అసలే బడి పంతులు ఉద్యోగం మరి ఆలోచించండి అన్నాడు గుర్నాధం శేఖర్ అమ్మానాన్నలతో ..

Broken Heart Grunge | Grunge textured broken heart symbol. T… | Flickr

అది విన్న ముగ్గురూ లోపలికి వెళ్లారు మాట్లాడుకోవడానికి చూడు శేఖర్ ఇప్పుడు నీ కోసం ఇలా ఇబ్బంది పడితే నీ చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు కావడం కష్టం, అసలే అప్పుల్లో ఉన్నాం మళ్లీ ఇదొక దాన్ని నేను వీటిని భరించే స్థితిలో లేను కాబట్టి నీకే నిర్ణయాన్ని వదిలేస్తున్నకాదునేను బయటకు వెళ్లి ఉంటాను.

నా ఇష్టం అంటావా అంటే మాత్రం అది కూడా కష్టమే మరి నీ ఆశను, నిండు నూరేళ్ళ జీవితాన్ని మేము మధ్యలో అపివేయలేము అలాగని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా ఇంట్లో పెట్టుకొలేను.

అలా అని నీ ఇష్టాన్ని కాదని అనలేను నేను ఈ విషయం లో అశక్తుడిని అయ్యాను జీవితాంతం నీ మొహాన్ని చూస్తూ నరకం అనుభవించ లేను బాబూ కానీ నిర్ణయం మాత్రం నీదే అంటూ రెండు చేతులు పట్టుకున్నాడు.

నాన్న మీరు బాధ పడకండి నన్ను కని పెంచి పెద్ద చేసి చదివించి ఇంతవాడిని చేశారు మి కోసం నా సుఖాన్ని నేను నా ఒక్కడి స్వార్థం కోసం నా చెల్లెలి జీవితాలను నాశనం చేయలేను అలాగని వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా కూడానేనుమిమల్నినిందించలేను.

ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం కష్టమే కానీ నేను ప్రయత్నిస్తాను అలాగే నన్ను ప్రేమించిన అమ్మాయి కి కూడా మర్చిపొమ్మని చెప్తాను నాన్న మీరు ఏమీ బాధపడకండి

నన్ను ఆదేశించే హక్కు మీకు ఉంది మీకు నచ్చని పని నేను నా జీవితంలో చేయను .. నన్ను మీరెలా కావాలంటే అలా మలుచుకోవచ్చు అన్నాడు శేఖర్ .

బాబు శేఖర్ ఏంట్రా ఇది అతను అలా అన్నాడు అని నీ ఇష్టాన్ని వదులు కుంటున్నావు అని నాకు చాలా బాధగా అనిపిస్తుంది నాయనా కానీ ఇందులో నేను ఏమి చేయాలని ఒక బొమ్మలా మిగిలిపోతున్నారు నన్ను క్షమించు బాబు అందితల్లిఅంజన

అమ్మా నువేమి బాధపడకు అమ్మా నీ కడుపున పుట్టిన నన్ను ఎంతో ప్రేమగా పెంచారు నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు అది చలమ్మా మీ ప్రేమ ముందు ఈ ప్రేమ చాలా చిన్నది అమ్మా సముద్రం లాంటి మీ ప్రేమ ఎక్కడ సముద్రం లో ఒక అణువు కానీ నా ప్రేమ ఎక్కడ అమ్మా వదిలేయండి అంటూ ఇద్దరి కాళ్ళు మొక్కినశేఖర్ విరిజ వద్దకు వెళ్ళాడు..

వీరందరి మాటలు వింటున్న విరిజ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ముందుకు రెండు అడుగులు వేసి శేఖర్ నాకు అర్దం అయ్యింది ఇలా అందరి మనసులు కష్టపెట్టి మనం సుఖంగా ఉండలేము అలాగే నిన్ను మరిచి పోయి ఇంకోపెళ్లిచేసుకోవడానికిప్రయత్నిస్తాను.

విరిజ అన్నాడు బాధగా అవును శేఖర్ మనం పెళ్లి చేసుకుంటే అటూ నీ చెల్లెళ్ళ ఉసురు నీ తల్లిదండ్రుల ఉసురు నా వైపు వాళ్ల ఉసురు కూడా పోసుకున్న దాన్ని అవుతాను మీ అందరి మాటలూ విన్న తర్వాత నాకు ఇక పెళ్లి అంటేనే విరక్తి పుడుతుంది.

ఇక ఇదే మన చివరి క్షణం అనుకుంటా పెళ్లి చేసుకున్నా నేనొక ప్రాణం లేని మరబొమ్మనే అంటూ శేఖర్ తల్లిదండ్రుల ముందుకు వెళ్ళు నాకు అత్తమామలు కావాల్సిన వాళ్ళు కానీ ఇప్పుడు ఒక ఆడపిల్లల తల్లిదండ్రులుగా మీ ఆలోచన మంచిదే నన్ను ఆశీర్వదించండి అంటూ వారి కళ్ళు మొక్కింది

Fire Heart - Free image on Pixabay

ఇద్దరూ కళ్ళ నిండా నీళ్లు నిండగా ఆమెను పైకెత్తుతూ తల్లి గుండె గట్టిగా చేసుకో ముగ్గురు అమ్మాయిల జీవితం నీ చేతిలో ఉంది తల్లి ఇప్పుడూ వాళ్లకు నీ అండదండలు కావాలమ్మా నీవు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది తల్లి చిన్నదనివైనా మంచి నిర్ణయం తీసుకున్నందుకు మెచ్చుకునోవడం తప్ప ఏమీ చేయలేముఅంటూఆశీర్వదించారు..

విరిజ కన్నీళ్ళ తో శేఖర్ ను చివరి సారిగా గట్టిగా కౌగలించుకుని తన ప్రేమను అక్కడే సమాధి చేసి బయట కుర్చీలో కూర్చుని. ఉన్న తండ్రి దగ్గరకు తల దించుకునివచ్చింది.

విరిజ ను చూసిన గుర్నాధం నువ్వెందుకు తల దించుకోవడం పెళ్లి అయితే నేను దించుకోవాలి తల కానీ నువ్వేం చేయలేదు గా ఏదో ఫ్రెండ్ ఇంటికి వచ్చావు అలాగే పద అంటూ కూతుర్ని హెచ్చరించాడు అతను తిరిగి శేఖర్ తల్లిదండ్రులకు నమస్కరిస్తూ..

అమ్మా మీ సహృదయత కు సంస్కారానికి చాలా కృతజ్ఞతలు అమ్మా మన రెండు కుటుంబాలు రోడ్డున పడకుండా చేశారు చాలా సంతోషం.

అంటూ నమస్కరించి కూతుర్ని పద అంటూ కరెక్కించి తీసుకుని వెళ్లారు . కారులో ఎక్కబోతున్న విరిజ చివరి సారిగా శేఖర్ వైపు చూసింది.

అతను విరిజనే చూస్తున్నాడు. నాలుగు కళ్ళు కలుసుకున్నాయి రెండు మనసులు విరిగి పోయాయి రెండు హృదయాలు ముక్కలు అయ్యాయి.

*****

ఆరునెలల  తర్వాత విరిజ పెళ్లి జరిగింది. అటూ శేఖర్ పెళ్లి కూడా జరిగిపోయింది. విరిజ భర్త పేరు విహారి అందమైన వాడు నెలకు రెండు లక్షలు సంపాదన ఒకడే కొడుకులక్షలఆస్తి

పెళ్ళి అయిన మొదటి రాత్రి తెల్లని చీర పాల గ్లాస్ తో అమ్మలక్కలు ముచ్చట్లు పెడుతూవిరిజ ను గదిలోకి పంపారు.

ప్రేమించిన వాడిని మర్చిపోలేక తల్లిదండ్రులు చూపించిన వాడిని పెళ్లి చేసుకుని ప్రాణం లేని బొమ్మగా, హృదయం లేని మనిషిగా కోరికలు అన్ని చంపుకుని,

బ్రతకలేక చావలేక ఒక మర బొమ్మలా మారిపోయిన కట్టేలా విరిగిన మనసుతో ఆ గదిలోకి అడుగపెట్టిన విరిజ ఒకసారి గది అంతా కలియ చూసింది.

గదిలో ఎక్కడా విహారి జాడ కనిపించలేదు విరి జ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుంది. ఇంతలో వెనక నుండి హాలో అంటూ వచ్చాడు విహారి అతన్ని చూసిన విరిజ కళ్ళుపెద్దవిఅయ్యాయి.

విరిజ అంతగా ఆశ్చర్య పోవడానికి కారణం అతని ప్రవర్తన ఆకారం జుట్టును నున్నగా దువ్వి పిలక లాగా కట్టుకున్నాడు, ఎర్రని బొట్టు , తెల్లని మొహానికి కళ్ళ తో కాటుక, పింక్ కలర్ చీర, మ్యాచింగ్ జాకిట్ , పెదవులకు లిఫిస్టిక్ , చేతులకు ఆకుపచ్చ గాజులు, పదాలకు పసుపు తో అచ్చం ఆడపిల్లల ఉన్నాడు విహారి.

Can You Die of a Broken Heart? — And Other Emotional Questions – Health Essentials from Cleveland Clinic

అంతగాచూడకునాకుసిగ్గుగాఉంటుంది బంగారం అంటూ చేతులు రెండు మొహానికి కప్పుకున్నాడు విహారి తర్వాత తీసేస్తూ ఏంటి విరిజా నువ్వు ఇలా బిగుసుకు పోవడం మంచిది కాదు కానీ ఇలార అంటూ బెడ్ పైకి తీసుకుని వెళ్లి కూర్చో బెట్టి తనగాజులనుసవరిస్తూ ..

దించిన తల పైకెత్తి చూడు విరిజ నన్ను తప్పుగా అనుకోకు ఇలా డ్రెస్ చేసుకున్నా అని నేను తేడా అనుకోవద్దు నీ మొహం కొంచమైనా నవ్వు తో కనిపిస్తుందేమో అని చిన్న ప్రయత్నం చేశాను కానీ అది వ్యర్థ ప్రయత్నం అని తెలిసిపోయింది.

కానీ విరిజ నాకు వచ్చే భార్య నాతో బాగుండాలని నన్నే ప్రేమించాలని కోరుకుంటాడు ఏ మగాడు అయినా నీ గురించి నాకు అన్ని తెలుసు శేఖర్ తో నీ ప్రేమ ,పెళ్లి మీ నాన్న బెదిరిoపులు అన్ని తెలుసు ఎలా అని అడగకు అయితే నీతో ఒక్కటిమాత్రంచెప్పగలను

నిన్ను నేను శేఖర్ కంటే ఎక్కువగా ప్రేమించగలను అతన్ని మర్చిపోవడం నికు కష్టమే అయినా నువ్వు అతన్ని ఎప్పుడు మర్చిపోయి ప్రేమగా నా దగ్గరికి వస్తావో అప్పుడే మన జీవితం మొదలు అవుతుంది సరేనా నేను నిన్ను ఇబ్బంది పెట్టను.

ఈ విషయం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు నువ్వు ప్రశాంతంగా ఉండు నీ ప్రేమ కోసం నేను జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటాను.. బై గుడ్ నైట్ అంటూ దిండు తీసుకుని సోఫా వైపు నడిచాడు విహారి…

విరిజ మనసు మారాలని విహారి తో జీవితాన్ని పంచుకోవాలని మనమూ ఆశిద్దాం..

Related Posts

4 Comments

  1. బాగుంది.ఫ్యామిలీ మూవీ చూస్తున్నట్టుగా ఉంది.ఇంకా కొన్ని ట్విస్ట్ లు ఏమైనా ఉంటే ఇంకా బాగుండేది.

Comments are closed.