విరులు

విరులు

పుడమిపైన పూలవనము ప్రకృతికే అందము
తరులన్ని విరబూసిన నయనాలకు అందము
పూల ద్వారతోరణాలు ప్రతి ఇంటికి అందము
వనమంతా గుబాళించు విరులెంతో అందము
మగువల కురులందు మురిసిన విరులందము
ఇంద్ర ధనుస్సును బోలిన విరుల తరులు అందము
హరి హరుల శిరములపై వాలిన విరులందము

జనహృదయం దోచుకున్న సుమ సుగంధ పరిమళం

అమరవీరుల పాదాలచెంత పడినపూలు ధన్యము
బాలాజిని అభిషేకించు విరులతతులు ధన్యము
త్యాగధనుల మెడను వాలుపూలదండ ధన్యము

విరుల పంట పండించే రైతు జన్మ ధన్యము
కుసుమాల పోషకుడు వనమాలి ధన్యుడు
విరులనేరు పూబోనుల కరములు ధన్యము

మగవారిని మరులు గొలుపు విరిదండకు వందనం
ప్రతిఫల మాసించని కుసుమాలకు వందనం విరుల త్యాగగుణమున్న మనుషులకు వందనం

– కోట

Related Posts